బీహార్ సీఎంగా 9వసారి నితీష్ కుమార్ ప్రమాణం: కొలువుదీరిన ఎన్డీఏ సర్కారు, మోడీ ఏమన్నారంటే?
పాట్నా: అనేక మలుపుల తర్వాత బీహార్‌లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 9వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నితీష్ కుమార్ తో బీహార్ గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు.
బీజేపీ, ఎల్జేపీ మద్దతు తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు హాజరయ్యారు.

నితీష్ కుమార్ తోపాటు ఎనిమిది మంది మంత్రలుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నుంచి విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, హిందూస్థాన్ అవామ్ మోర్చా నుంచి ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ మంత్రలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
నిన్న మొన్నటి వరకు ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమి చేరడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మీరింది. దీంతో ఇండియా కూటమి పూర్తిగా విచ్ఛిన్నమయ్యే దిశగా సాగుతోంది. ఇప్పటికే ఇండియా కూటమిపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తీరుపై వీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా కూటమిన కన్వీనర్‌గా ఎన్నికైన నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏలో చేరడంతో ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరడంతో బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. బీహార్ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రధాని మోడీ అభినందనలు
కాగా, బీహార్‌లో ఎన్డీయే సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే దిశగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్, డిప్యటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసిన సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలకు అభినందనలు తెలిపారు. ఈ కొత్త ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ నిబద్ధతతో సేవలందిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.












Click it and Unblock the Notifications