బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్: ప్రమాణ స్వీకారం తేదీ..సమయం ఇదే
పాట్నా: బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. తదుపరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజధాని పాట్నాలోని నితీష్ కుమార్ నివాసంలో ఎన్డీఏ ఎమ్మెల్యేల ఉమ్మడి భేటీ సందర్భంగా ఆయనను సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ఈ సమావేశం ముగిసిన వెంటనే నితీష్ కుమార్ రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. గవర్నర్ ఫగు చౌహాన్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తనకు ఉందని వివరించారు.
ముఖ్యమంత్రిగా తన పేరును బలపరుస్తూ ఎమ్మెల్యేలు చేసిన సంతకాలతో కూడిన లేఖను ఆయనకు అందజేశారు. అనంతరం ఆయన రాజ్‌భవన్ వెలుపల విలేకరులతో మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని వెల్లడించారు. కాగా సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. వేదిక ఎక్కడ అనేది ఇంకా ఖారారు కాలేదు.

ఈ ఉదయం నితీస్ కుమార్ నివాసంలో జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా శాసన సభ్యులు కూడా దీనికి హాజరయ్యారు. ఎన్డీఏ తరఫున రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీ సందర్భంగా- సభా పక్ష నేతగా రాజ్‌నాథ్ సింగ్.. నితీష్ కుమార్ పేరును ప్రతిపాదించగా.. జీతన్ రామ్ మాంఝీ బలపరిచారు. అనంతరం ఎమ్మెల్యేలందరూ ఆయనను ఎన్నుకున్నారు.
Recommended Video
ఈ మేరకు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశారు. ఈ ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో బీజేపీ-74, జేడీయూ-43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రిగా నితీస్ కుమార్ నితీష్ కుమార్ పేరును బలపరుస్తూ హిందుస్తాన్ ఆవామీ మోర్చా-4, వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ-4 ఎమ్మెల్యేలు వేర్వేరుగా లేఖలను ఇచ్చారు. వాటిని తీసుకుని నితీష్ కుమార్ నేరుగా రాజ్‌భవన్ వెళ్లారు. గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఓ స్వతంత్ర అభ్యర్థి ఎన్డీఏకే మద్దతు పలికారు. ఎన్డీఏ ఉమ్మడి భేటీలో చోటు చేసుకున్న పరిణామాలు, చర్చకు వచ్చిన అంశాలను ఆయనకు వివరించారు. ముఖ్యమంత్రిగా తన పేరును బలపరుస్తూ చేసిన సంతకాలతో కూడిన లేఖను అందజేశారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications