బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిత్యానంద స్వామీజీ రాసలీలలు, రేప్ కేసు, కోర్టు ముందు హాజరైన లెనిన్, నిందితులు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలోని ధ్యానపీఠం ఆశ్రమంకు చెందిన నిత్యానంద స్వామి అలియాస్ నిత్యానంద మీద నమోదు అయిన అత్యాచారం, రాసలీలల కేసుల విచారణ రామనగరలోని మూడవ అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టులో జరిగింది.

మాజీ కారు డ్రైవర్

మాజీ కారు డ్రైవర్

నిత్యానంద స్వామి మాజీ కారు డ్రైవర్ లెనిన్ కురుప్పన్ సీఐడీ అధికారులతో కలిసి రామనగర కోర్టు ముందు హాజరైనారు. రామనగర జిల్లా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి గోపాలకృష్ణ రై ముందు లెనిన్ కురుప్పన్ సాక్షం చెప్పాడు.

ఆరతి రావ్ రేప్ కేసు

ఆరతి రావ్ రేప్ కేసు

న్యాయమూర్తి గోపాలకృష్ణ రై లెనిన్ కురుప్పన్ చెప్పిన సాక్షాన్ని వీడియో చీత్రికరించి రికార్డు చేసుకున్నారు. నిత్యానంద స్వామి ఆరతి రావ్ మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిత్యానంద స్వామి ప్రముఖ ఆరోపి అని కేసు నమోదు అయ్యింది.

స్వామి, రెడ్డి, రాగిని డుమ్మా !

స్వామి, రెడ్డి, రాగిని డుమ్మా !

నిత్యానంద స్వామితో పాటు మూడవ ఆరోపి అయిన గోపాలశీలం రెడ్డి, ఐదవ ఆరోపి రాగిణి కోర్టు విచారణకు హాజరుకాలేదు, ధనశేఖరన్, జమునా రాణి మాత్రం కోర్టు ముందు విచారణకు హాజరైనారు. బుధవారం ఉదయం, మద్యాహ్నాం నిత్యానంద స్వామి మీద నమోదు అయిన అత్యాచారం, రాసలీలల కేసు విచారణ జరిగింది.

సుప్రీం కోర్టు ఆదేశం

సుప్రీం కోర్టు ఆదేశం

నిత్యానంద కేసు విచారణ త్వరగా పూర్తి చెయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు విచారణకు సహకరించకపోవడంతో కేసు విచారణ ఆలస్యం అవుతోందని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో చెప్పారు.

కోర్టు హెచ్చరిక

కోర్టు హెచ్చరిక

తదుపరి విచారణకు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందతో పాటు అందరూ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి ఇదే నెల 16వ తేదీకి కేసు విచారణ వాయిదా వేశారు. నిత్యానంద స్వామి మాజీ కారు డ్రైవర్ లెనిన్ కురుప్పన్ కు పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.

English summary
Following rape case against Nityananda swami of Bidadi Ashram, car driver Lenin attended the hearing before Ramnagar court and recorded his statement on the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X