Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమ్మ నిత్యానంద.. అమ్మాయిలతో సరసాలే కాదు.. మాటలు చెప్పడంలో కూడా నువ్వు తోపే.. (వీడియో)

నిత్యానంద స్వామి. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. రాసలీలలతో ఫుల్ ఫేమస్ అయిన ఈ స్వామీజీ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉంటారు. భక్తురాలిలో రాసలీలలు నడిపినా.. గంగానది మట్టితో సిలికాన్ చిప్‌లు తయారు చేసినా.. జంతువులతో మాట్లాడించినా అది ఆయనకే చెల్లింది. వేల మంది అనుచరులున్న ఈ స్వామీజీ తాజాగా చెప్పిన ఓ విషయం వింటే దిమ్మదిరిగి బొమ్మ కనబడటం ఖాయం.

సూర్యున్ని ఉదయించకుండా ఆపే శక్తి..

సూర్యున్ని ఉదయించకుండా ఆపే శక్తి..

నిత్యానంద బోధనలు వినేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అలా వచ్చే భక్తులకు తన మహిమల గురించి గొప్పగా చెప్పే ఈ స్వామీజీ తాజాగా మరో విషయం సెలవిచ్చారు. తనకు సూర్యున్ని సైతం ఆపగలిగే శక్తి ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన ఆశ్రమంలో భక్తులతో ముచ్చటించిన ఆయన తాను ఓ ధ్వజారోహణ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆలస్యం కావడంతో సూర్యున్ని అప్పుడే ఉదయించవద్దని ఆదేశించానని చెప్పాడు. తాను ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తి చేసి బయటకు వచ్చిన తర్వాతే తూర్పున సూర్యుడు ఉదయించాడని చెప్పాడు. ఇలా దాదాపు 40నిమిషాల పాటు సూర్యోదయాన్ని ఆపానని చెప్పుకున్నారు. నమ్మకం లేకపోతే సూర్యోదయ సమయం, నిజంగా సూర్యుడు ఉదయించిన సమయాన్ని గూగుల్‌లో చూసుకోవచ్చని చెప్పారు. నిత్యానంద చెప్పిన మాటలు విన్న భక్తులు చప్పట్లు కొట్టి మైమరచిపోవడం విశేషం. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిత్యానందతో నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.

గంగానది మట్టితో చిప్‌లు

గంగానది మట్టితో చిప్‌లు

నిత్యానంద ఇలాంటి ప్రకటనలు చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలో గంగానది మట్టితో చిప్‌లు తయారుచేస్తానని చెప్పాడు ఈ సైన్స్ గురు. సిలికాన్ వ్యాలీ నిపుణులు త్వరలోనే గంగానది మట్టితో ప్రయోగాలు చేస్తారని జోస్యం చెప్పాడు. ఆ మట్టితో తయారయ్యే చిప్‌లు ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించే చిప్‌ల కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తాయని అన్నారు. మరోవైపు మ్యూజిక్, విజువల్ స్టోరేజ్ యాప్స్ తయారీకి యమున మట్టిని ఉపయోగిస్తారని నిత్యానంద స్వామి సెలవిచ్చారు.

జంతువులతో మాట్లాడిస్తా

జంతువులతో మాట్లాడిస్తా

అంతేకాదు త్వరలోనే ఆవులు, సింహాలు, పులులు ఇలా ఒక్కటేమిటి అన్ని జంతువులు స్పష్టంగా మనుషులతో మాట్లాడతాయని నిత్యానంద చెప్పారు. శాస్త్రీయంగా దాన్ని నిరూపిస్తానని చెప్పారు. గోవులు మీతో తమిళం, సంస్కృతంలో మాట్లాడేలా చేస్తానని అన్నారు. అత్యున్నత స్పృహ ద్వారా జంతువులకు భాషపై స్పృహ, మాట్లాడే వరం ప్రసాదించవచ్చని నిత్యానంద చెబుతున్న వీడియో అప్పట్లో నెట్టింట్లో వైరల్ అయింది. శాస్త్రాధారాలతో తాను నిరూపిస్తానని శపథం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+