ప్రముఖ నటి కిడ్నాప్ లైంగిక దాడి కేసు: దిలీప్ కు నో బెయిల్: హైకోర్టు, హీరోకు జైలే గతి!

కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ స్టార్ హీరో దిలీప్ బెయిల్ పిటీషన్ విచారణ చేసిన కేరళ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దిలీప్ కు వ్యతిరేకంగా బలమైన సాక్షాలు ఉన్నాయని కేరళ హై కోర్టు చెప్పింది.

నటి కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడి చెయ్యాలని దిలీప్ సూచించాడని ఈ కేసులో అరెస్టు అయిన ప్రముఖ నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ అంగీకరించాడని పోలీసులు కోర్టులో చెప్పారు. దిలీప్ కు బెయిల్ ఇస్తే కేసు విచారణకు అంతరాయం కలుగుతుందని పోలీసులు అన్నారు.

No Bail for Malayalam actor Dileep from Kerala High Court.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైతం దిలీప్ కు బెయిల్ ఇవ్వరాదని, అతనికి బెయిల్ ఇస్తే రాజకీయంగా, డబ్బు ప్రభావంతో సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఇంతకు ముందే కోర్టులో చెప్పారు. అయితే దిలీప్ న్యాయవాది రామ్ కుమార్ మాత్రం ఈ కేసులో తన క్లైంట్ కు ఎలాంటి సంబంధం లేదని వాదించారు.

దిలీప్ కు బెయిల్ ఇవ్వాలని కోర్టులో మనవి చేశారు. ఇరు వర్గాల వాదన విన్న కేరళ హైకోర్టు గత నాలుగు రోజుగా పోలీసులు సేకరించిన సాక్షాలు పరిశీలించింది. సోమవారం కేరళ హైకోర్టు దిలీప్ కు బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పింది. ఈ దెబ్బతో హీరో దిలీప్ షాక్ కు గురైనాడు. హీరో దిలీప్ ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+