బీచ్‌లలో బికినీలపై నిషేధం లేదు: గోవా సిఎం పారికర్
పనాజీ: గోవా బీచ్‌లలో బికినీలను ధరించడంపై నిషేధం విధిస్తారన్న అంశంపై బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పష్టతనిచ్చారు. గోవాలోని బీచ్‌లలో బికినీలపై ఎలాంటి నిషేధం విధించడం లేదని ఆయన తెలిపారు. అయితే బహిరంగ ప్రదేశాల్ల మద్యం సేవించడాన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
బీచ్‌లలో బికినీలు ధరించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేసిన తన మంత్రివర్గ సహచరుడు సుదిన్ ధవాలికర్ వ్యాఖ్యలపై స్పందించమని మీడియా కోరగా ఆయన స్పందించారు. బీచ్‌లలో బికినీలను ధరించడంపై గోవా ప్రభుత్వం నిషేధం విధించదని తెలిపారు. దీని ద్వారా సభ్యతకు ఎలాంటి ప్రమాదం పొంచివుండదని అన్నారు. పబ్బులపై కూడా ఎలాంటి నిషేధం విధించడం లేదని చెప్పారు.

ఇటీవల గోవా మంత్రి ధవాలికర్ మాట్లాడుతూ.. గోవా బీచ్‌లలో బికినీ ధరించడంపై నిషేధం విధించే అవకాశాలున్నాయని చెప్పారు. ఇది ప్రతీ సంవత్సరం వచ్చే విదేశీ పర్యాటకులపై ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో యువతులు బికినీలు ధరించడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులను నియంత్రించడం కష్టంగా మారుతోందని చెప్పారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆలస్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఇలాంటి చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. గోవా సిఎం కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ధవాలికర్ వ్యాఖ్యలపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో గోవా సిఎం మనోహర్ పారికర్ పై విధంగా స్పందించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications