సోనియా మాట చెల్లట్లేదా, మేం క్లియర్: టిపై జవదేకర్

సొంత పార్టీ ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు, నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. కాంగ్రెసు పార్టీ విభజనతో రాజకీయాలు చేస్తోందన్నారు. బిజెపి విధానం మొదటి నుండి చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. కాంగ్రెసు పార్టీలో సోనియా, ఆ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మాట చెల్లడం లేదా అని ప్రశ్నించారు.
పార్లమెంటును కాంగ్రెసు పార్టీ సజావుగా నడపలేకపోతుందన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ సొంత పార్టీ నేతలను వదిలి పెట్టి తమ పార్టీ లోకసభ పక్ష సభ్యురాలు సుష్మా స్వరాజ్ పైన ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. కాంగ్రెసు పార్టీ సొంతింటిని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు.
లోకసభ నుంచి సస్పెండ్ చేసిన తమపై బహిష్కరణ నిర్ణయం ఎత్తివేసిన తర్వాతే బిల్లు ప్రవేశపెట్టాలని టిడిపి సీమాంధ్ర ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తమకు పార్టీల కన్నా ప్రజలే ముఖ్యమన్నారు. రేపు సభలో బిల్లుపై చర్చ సందర్భంగా సీమాంధ్ర నేతలు గొడవ చేయకుండా ఉండాలని సూచించేందుకే రాహుల్ గాంధీ వారితో భేటీ కానున్నారన్నారు.












Click it and Unblock the Notifications