కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం: తమ ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ
న్యూఢిల్లీ: మంగళవారం లోకసభలో తమ అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. లోకసభ సమావేశాలకు ఎంపీలందరూ హాజరు కావాలని స్పష్టం చేసింది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన సుమారు వారం తర్వాత కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెట్టడం గమనార్హం.
కాంగ్రెస్ తర్వాత సీపీఎం, ఆర్ఎస్పీలు కూడా సోమవారం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కూడా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం ఉంటే తాము ఆందోళనలను చేపట్టమని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే, టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఇతర పార్టీల ఎంపీల ఆందోళనల నేపథ్యంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications