జయ మృతిలో కుట్ర లేదు: గౌతమికి 'శశికళ' అన్నాడీఎంకే కౌంటర్!
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి పైన అనుమానాలు ఉన్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రముఖ నటి గౌతమి రాసిన లేఖ పైన అన్నాడీఎంకే వర్గాలు శుక్రవారం నాడు స్పందించాయి. గౌతమి అనుమానిస్తున్నట్లుగా జయ మృతిలో ఎలాంటి కుట్ర లేదని చెప్పారు.
జయలలిత మృతి విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. గౌతమి అనుమానాలను కొట్టి పారేశారు.

జయ మృతిలో కుట్ర లేదు
ఇదిలా ఉండగా, ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీ.. జయలలిత నెచ్చెలి శశికళ చేతుల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. పైగా ఆమె పైన విమర్శలు ఉన్నాయి. పార్టీ పగ్గాలు ఆమె చేతుల్లో ఉన్న సమయంలో ఇలాంటి ప్రకటనే వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జయ మృతిలో ఎలాంటి కుట్ర లేదని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి.

మోడీకి లేఖ
కాగా, జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నాయని వాటిని దర్యాప్తు చేయాలని గౌతమి ప్రధాని మోడీకి తన బ్లాగు ద్వారా లేఖ రాసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జయలలితకు వైద్యులు కొద్దిరోజుల పాటు చికిత్స అందజేసి, ఆమె ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని చెప్పారని గుర్తు చేశారు.

జయ మృతిపై అనుమానాలు
తర్వాత ఆకస్మాతుగా గుండెపోటు రావడం, ఆ మరుసటి రోజే ఆమె మృతి చెందడంపై అనుమానాలు కలుగుతున్నట్లు పేర్కొన్నారు. జయ మృతి వెనుక ఉన్న నిజనిజాలను కప్పిపుచ్చడానికి యత్నిస్తున్నారని, ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమెని ఎవరికీ చూపించలేదన్నారు.

తమిళుల ఆరాధ్యురాలు
ఆమెని కలవాలని వెళ్లిన ప్రముఖులు ఎవరూ ఆమె బాగానే ఉన్నారన్న విషయాన్ని నేరుగా చెప్పలేదన్నారు. తమిళనాడు ప్రజలకు ఆరాధ్యురాలైన జయ గురించి ఇంత గోప్యంగా ఎందుకు ఉంచారో చెప్పాలన్నారు.

మరణం ప్రశ్నగా మిగలొద్దు
జయను కలవకూడదని ఏ అధికారం చెప్పిందని, ఆమె చికిత్సపై ఎవరు నిర్ణయాలు తీసుకున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పే వారు ఎవరని గౌతమి ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న నేతల గురించి తెలుసుకునే హక్కు వారికి ఉంటుందని, ఆమె మరణం సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోవద్దని విజ్ఞప్తి చేశారు. మోడీ ఎవరికీ భయపడని, ప్రజలకోసం నిలబడే నేత అని, కాబట్టి తన విన్నపానికి స్పందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications