రుతుపవనాల ఆలస్యం లేదు: రెండ్రోజుల్లో మహారాష్ట్రలోకి, ఏపీలో వర్షాలు, తెలంగాణలో వడగాలులు

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఎలాంటి ఆలస్యం లేకుండా పురోగమిస్తున్నాయని, మరో రెండు రోజుల వ్యవధిలో మహారాష్ట్రకు చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. రుతుపవనాలు దక్షిణ, మధ్య అరేబియా సముద్రం, మొత్తం కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను మే 31, జూన్ 7 మధ్య కవర్ చేశాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త ఆర్‌కె జెనామణి తెలిపారు.

మరో రెండ్రోజుల్లో మహారాష్ట్రతోపాటు ఏపీకి రుతుపవనాలు

మరో రెండ్రోజుల్లో మహారాష్ట్రతోపాటు ఏపీకి రుతుపవనాలు

మరో రెండు రోజుల్లో గోవాతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలపై రుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.'రాబోయే రెండు రోజుల్లో మాకు బలమైన రుతుపవన లక్షణాలు కనిపిస్తున్నాయి. బలమైన గాలులు ఉన్నాయి, మేఘాలు అభివృద్ధి చెందడం ప్రారంభించాయి' అని జెనామణి చెప్పారు. ఇదే సమయంలో ఈశాన్య భారతదేశం మొత్తం మంచి వర్షపాతం నమోదైందని స్పష్టం చేశారు.

రుతుపవనాల రాకలో ఎలాంటి జాప్యం లేదు.. ఏపీలో వర్షాలు

రుతుపవనాల రాకలో ఎలాంటి జాప్యం లేదు.. ఏపీలో వర్షాలు

'రుతుపవనాల రాకలో ఎలాంటి జాప్యం లేదు. రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్రలోకి ప్రవేశిస్తాయి. తర్వాత రెండు రోజుల్లో ముంబయిలోనూ వర్షాలు పడొచ్చు' ఐఎండీ శాస్త్రవేత్త తెలిపారు. ఈసారి నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగా కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు జేనామణి.గోవా, మహారాష్ట్రల్లోని ఇతర ప్రాంతాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడులో.. రెండు రోజుల్లో రుతుపవనాల్లో పురోగతి కనిపిస్తుందని, దీంతో వర్షాలు కురుస్తాయని ఆయన అంచనా వేశారు.

తెలంగాణతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వడగాలులు

తెలంగాణతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వడగాలులు

జూన్ 8న జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, జూన్ 08, 09 తేదీల్లో ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా-ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని వివిక్త ప్రదేశాలలో వేడి తరంగాల పరిస్థితులు కొనసాగనున్నాయి. కాగా, నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్తముందే పలకరించాయి. సాధారణంగా జూన్‌ ఒకటిన కేరళలో ప్రవేశించే 'నైరుతి' మూడు రోజుల ముందుగానే వచ్చేసిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మే 29న కేరళను రుతుపవనాలు తాకినట్లు వాతావరణ విభాగ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. అక్కడే స్థిరంగా ఉండి 4 రోజులకు కర్ణాటక, తమిళనాడును తాకాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+