ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ ఏమీ లభించలేదు: కోర్టుకు తెలిపిన ఎన్సీబీ అధికారి
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు సోమవారం కోర్టుకు తెలిపారు. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ఆదివారం అరెస్టైన విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్‌ను కస్టడీ కోరిన సందర్భంగా దర్యాప్తు అధికారి ఈ మేరకు కోర్టుకు తెలిపారు.
కోర్టులో ఆర్యన్ ఖాన్ తరపున న్యాయవాది సతీష్ మనేషిండే వాదనలు వినిపించారు. 23 ఏళ్ల యువకుడు ఆర్యన్ ఖాన్.. కార్డెలియా క్రూయిస్ ఎంప్రెస్ షిప్‌లో పార్టీకి "ప్రత్యేక ఆహ్వానితుడు" అని వాదించారు. ఆర్యన్‌తో పాటు మరో ఏడుగురిని ఎన్‌సిబి శనివారం అరెస్టు చేసింది. కాగా, ముంబైలోని కోర్టు.. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్ముమ్ ధమేచా, మరో ఐదుగురిని అక్టోబర్ 7 వరకు ఎన్సీబీ కస్టడీకి మంజూరు చేసింది.

ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్‌కు ప్రత్యేక ఆహ్వానితుడని ఈ కేసులో అతని ప్రమేయం లేదని ఆర్యన్ ఖాన్ తరఫున సతీష్ మానషిండే వాదించారు. ఆర్యన్ ఖాన్ బ్యాగ్‌లో ఏమీ లేవని, అతని బ్యాగ్‌లో 6 గ్రాములు అతి తక్కువ పరిమితిలో మాత్రమే డ్రగ్స్ ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. అధికారులు తన ఫోన్‌లో చాట్‌లను మాత్రమే కనుగొన్నారని, "రికవరీ లేని వాట్సాప్ చాట్‌లకు" ఎలాంటి ప్రాముఖ్యత లేదని సతీష్ మానషిండే అన్నారు. ఆర్యన్ ఖాన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సతీష్ మానషిండే పార్టీలో ఆర్యన్ ఎటువంటి మాదక ద్రవ్యాల వినియోగానికి పాల్పడలేదని పేర్కొన్నారు.
ఇతర నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ వల్ల అతడ్ని కస్టడీకి అడగడం సమంజసం కాదని ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది వాదించారు. అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా గురించి ఎన్సీపీ వాదన చేస్తోందని, ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.
కాగా, ఈ కేసులో దర్యాప్తు ప్రధానమైనదని, దాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఆర్యన్ ఖాన్ తో పాటు, ఆర్యన్ స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాను కూడా అక్టోబర్ 7 (గురువారం) వరకు ఎన్‌సిబి కస్టడీకి పంపించారు. న్యాయమూర్తి నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో వారు "కన్నీళ్లు పెట్టుకున్నారు". ముంబై నుంచి గోవా వెళ్తున్న "కార్డెలియా" క్రూయిజ్‌లో శనివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీపై డ్రగ్స్ నిరోధక ఏజెన్సీ దాడి చేసిన తర్వాత ఆదివారం ముగ్గురిని అరెస్టు చేశారు.
ఈ దాడుల్లో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 22 మాత్రలు ఎండీఎంఏ, 5 గ్రాముల ఎండీ లభించాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. వారి వద్ద బట్టలు, లోదుస్తులు, పర్సులలో డ్రగ్స్ దాచినట్టుగా సమాచారం .ఆర్యన్ ఖాన్‌ను ప్రశ్నించడానికి అక్టోబర్ 11 (సోమవారం వారం) వరకు కస్టడీలో ఉండాలని ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో లింకులు ఉన్నాయని ఎన్సీబీ అధికారులు ఆరోపించారు.
Recommended Video
నిందితులను విచారించక పోతే ఎవరు సరఫరా చేస్తున్నారో ? ఎవరు ఫైనాన్స్ చేస్తున్నారో? తెలుసుకోవడం కష్టమవుతుందని ఎన్‌సిబి తెలిపింది. చాట్‌లు మొదలైన లింక్‌లు అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా ప్రమేయాన్ని చూపుతున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఆర్యన్ ఖాన్ చాట్‌లు, లింక్‌లలో "కోడ్ పేర్లు" కనుగొనబడ్డాయని, ఆర్యన్ ఖాన్ బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ లను ధ్రువీకరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications