ఆ భయమేమీ లేదు: పొలిటికల్ ఎంట్రీపై కమల్ హాసన్
రాజకీయాల్లో విఫలమవుతాననే భయమేమీ తనకు లేదని ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఆయన తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. రాజకీయాలు అంటే సినిమా నిర్మాణం వంటివి కావని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: రాజకీయాల్లో విఫలమవుతాననే భయమేమీ తనకు లేదని ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఆయన తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. రాజకీయాలు అంటే సినిమా నిర్మాణం వంటివి కావని ఆయన అన్నారు.
తమిళనాడు రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. తన వరకు వస్తే రాజకీయాల్లో విఫలమవుతాననే భయం లేదని, అది సినిమా నిర్మాణం వంటిది కాదని అన్నారు.
శనివారం ఢిల్లీలో జరిగిన టైమ్స్ లిట్‌ఫెస్ట్ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన రాష్ట్రం కోసం పనిచేయడానికి తాను సిద్ధపడ్డానని, దానికి తగిన గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

క్రియాశీలత ఇలా
తన క్రియాశీలత చర్యలోకి మారుతోందని, ఈ దృష్టితోనే తాను తీసుకుంటున్నానని కమల్ హాసన్ అన్నారు. బహుశా తనది తప్పే కావచ్చునని, కానీ తాను ప్రజల కోసం ఆ పనిచేస్తున్నానని అన్నారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఉద్దేశ్యమే తన సత్తాను చాటుతుందని ఆయన అన్నారు.

ప్రజలు ఇలా....
రోజు వారీ సమస్యలకు ప్రజలు ఇతరులను నిందించడం మానేసి తమంత తాము పరిష్కారాలు చూసుకుంటున్నారని కమల్ హాసన్ చెప్పారు. ఇతరులను నిందించడం మానేసి బాధ్యతను తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. తాను రాజకీయ నాయకుల తప్పుల గురించి తాను మాట్లాడడం లేదని, వారు అవినీతి పరులూ ప్రజల నుంచి ఎదగలేదనే విషయం తనకు తెలుసునని ఆయన అన్నారు.

వారిలా వచ్చారు....
రాజకీయ నాయకులు మన వీధుల నుంచి, జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చారని, వారు మన రూపంలోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ మనలను పోలి ఉండవచ్చునని, తన రాష్ట్రానికి తాను ఏదో కొంత చేయాలని భావిస్తున్నానని ఆయన అన్నారు.

రాష్ట్రం గురించే ఎందుకు...
దేశ రాజధానికి వచ్చి దేశం గురించి కాకుండా తమిళనాడు గురించే ఎందుకు మాట్లాడుతున్నారని అడిగితే, అక్కడే దేశం ప్రారంభమవుతుందని, అది ప్రవేశద్వారం అదేనని కమల్ హాసన్ సమాధానమిచ్చారు. తొలుత తన ప్రవేశ ద్వారాన్ని శుభ్రం చేయాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. అక్కడే తాను ప్రారంభమవుతానని అన్నారు.












Click it and Unblock the Notifications