'టీచర్లూ.. మీకిక జీన్స్ వేసే ఛాన్స్ లేదు'

చంఢీఘడ్ : ఇన్నాళ్లూ అనధికారికంగా గ్రామాల్లో కొనసాగుతున్న ఆంక్షలు ఇకపై హర్యానా అంతటా అమలులోకి రానున్నాయి. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తాజా ఆదేశాల మేరకు ఇకపై అక్కడి స్కూల్ టీచర్లు జీన్స్ ప్యాంట్ ధరించి స్కూల్ కి రావడంపై నిషేధం విధిస్తున్నారు.

కాగా, హర్యానాలోని గ్రామీణ ప్రాంతాలపై అక్కడి ఖాప్ పంచాయితీల జోక్యం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడి చాలా గ్రామాల్లో ఇప్పటికీ కాలేజీ అమ్మాయిలు సెల్ ఫోన్లు ఉపయోగించడం, జీన్స్ ధరించడం వంటి వాటిపై అనధికార నిషేధం కొనసాగుతోంది.

ఇక ఇప్పుడు ప్రభుత్వమే రంగంలోకి దిగి ఉపాధ్యాయుల డ్రెస్సింగ్ పై ఆంక్షలు విధించింది. ఉపాధ్యాయులెవరు జీన్స్ ధరించి స్కూల్ కి రావద్దని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు జీన్స్ ధరించడం బాగుండదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

No jeans for Haryana school teachers now

దీన్ని సమర్థించుకుంటూ.. ఇప్పటికే ఒడిశా లాంటి రాష్ట్రాల్లో కూడా ఉపాధ్యాయుల డ్రెస్ కోడ్ పై ఆంక్షలు అమలు అవుతున్నాయని వివరణ ఇచ్చిన ప్రభుత్వం, అదే క్రమంలో తమ ప్రభుత్వం కూడా ఈ కొత్త ఆంక్షలను అమలు చేయబోతున్నట్టుగా ప్రకటించింది.

తాజా డ్రెస్ కోడ్ ఆంక్షలపై అక్కడి ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నా..! ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే దాస్ మాత్రం ప్రభుత్వ చర్యలను సమర్థించారు. ఇక డ్రెస్ కోడ్ ఆంక్షలపై త్వరలోనే అక్కడి విద్యాశాఖ మంత్రిని కలిసి తమ అభ్యంతరాలను తెలియజేయడానికి సిద్దమవుతున్నాయి హర్యానా ఉపాధ్యాయ సంఘాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+