విజయ్ మాల్యాకు ఇల్లు లేదు: రూపాయి అప్పులేదట

న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయాల్లోనే ఉంటుంది. అయితే లిక్కర్ కింగ్ అయిన విజయ్ మాల్యాకు బీర్ల తయారి కంపెనీ, ఐపీఎల్ జట్టు, ఎఫ్ వన్ టీమ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సహా పలు వ్యాపారాలు ఉన్నాయి.

బ్రిటన్ లో ఈయనకు సొంతంగా బంగ్లాలు ఉన్నాయని గతంలో మీడియాలో వార్తలు వచ్చాయి. 2013 ఫోర్బ్స్ జాబితాలో భారత్ లో అత్యంత ధనవంతులైన 100 మందిలో విజయ్ మాల్యా 84వ స్థానంలో నిలిచారు. అయితే లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన కంపెనీలు బ్యాంకులకు ఎగవేసిన మొత్తం రూ. 9,000 కోట్లకు పైగానే ఉంది.

No liability, no house and just Rs. 9,500

అయితే విజయ్ మాల్యాకు చెందిన పలు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఆయనకు సొంత ఇల్లు లేదట, భూమి అసలే లేదు. చేతిలో రూ. 9,500 మాత్రమే ఉంది, ఎవ్వరికి ఒక్క రూపాయి అప్పులేను అని ఆయన సొంతంగా వివరాలు వెల్లడించారు. 2010 రాజ్యసభకు పోటీ చేసిన సమయంలో విజయ్ మాల్యా దాఖలు చేసిన అఫిడివిట్ లో ఈ వివరాలు ఉన్నాయి.

ఫెర్రారీ కారు, బంగారు, బాండ్లు, డిపాజిట్లు ఇతర ఆస్తులన్నీ కలిపితే రూ. 615ద కోట్లు ఉంటుందని స్వయంగా విజయ్ మాల్లా ఆ అఫిడివిట్ లో దాఖలు చేసి సంతకం చేశారు. ఆరేళ్లకు ముందు విజయ్ మాల్యాకు కేవలం రూ. 615 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే ఉంటే బ్యాంకులు రూ. వేల కోట్లు రుణం ఎలా ఇచ్చాయి అనే విమర్శలు ఉన్నాయి. బ్యాంకులు సుప్రీం కోర్టును ఆశ్రయించే లోపు విజయ్ మాల్యా దర్జాగా విదేశాలకు వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+