మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని ప్రకటించిన ప్రధాని మోదీ

Mann Ki Baat: దేశంలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం నెలకొంది. మార్చి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య పొత్తుల వ్యవహారాలు ఒక్కటొక్కటిగా తేలుతున్నాయి.

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

No Mann ki Baat for next 3 months

ఈ పరిస్థితుల మధ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో ప్రసంగించారు. ఇది 110వ ఎపిసోడ్. ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు రేడియోలో ఈ ప్రీ రికార్డెడ్ కార్యక్రమం ప్రసారమౌతూ వచ్చింది. ఇప్పుడు దానికి బ్రేక్ పడింది.

నేడు మోదీ చేసిన ప్రసంగం చివరిది. ప్రధానిగా మోదీ రెండో టర్మ్‌లో ఇదే చివరి ప్రసంగం కావడంతో మన్ కీ బాత్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.2014లో తొలిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ కార్యక్రమానికి చేపట్టారు. 2019లో రెండోసారి కూడా ఆయనే ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత దీన్ని కొనసాగించారు.

తన చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ.. కీలక ప్రకటన చేశారు. మార్చి చివరి ఆదివారం నాటికి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని, ఆ వెంటనే కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు. అందువల్లే ఈ టర్మ్‌లో ఇదే తన చివరి ప్రసంగం అని స్పష్టం చేశారు.

మరో మూడు నెలల పాటు మన్ కీ బాత్‌కు విరామాన్ని ఇచ్చినట్లు ప్రకటించారు. 110 నెలల పాటు ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగిందని, ఎన్నికల తరువాత మళ్లీ దేశ ప్రజల ముందుకు వస్తానని, 111వ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందామని అన్నారు. తొలిసారిగా ఓటు హక్కును పొందిన వారి గురించి మాట్లాడారు మోదీ. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+