పాక్‌తో రష్యా సైనిక విన్యాసాలు: భారత్ అభ్యంతరం, వెనక్కి తగ్గారు

న్యూఢిల్లీ: పొరుగుదేశం పాకిస్థాన్‌తో కలిసి గిల్గిట్-బాల్టిస్తాన్‌లో తాను సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు వస్తున్న వార్తలపై రష్యా స్పందించింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 'అజాద్ కాశ్మీర్' గా పిలవబడేది భారత భూభాగమేనని, ఈ ప్రాంతంలో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడంపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో రష్యా వివరణ ఇచ్చింది.

సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో పాకిస్థాన్‌తో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించబోమని ఢిల్లీలోని రష్యన్ ఎంబసీ కార్యాలయం స్పష్టం చేసింది. పాకిస్థాన్‌తో కలిసి రష్యా తొలిసారిగా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించబోతుంది. దీని కోసం రష్యా సేనలు రావల్పిండికి వచ్చాయి.

No military exercise with Pakistan in PoK: Russia

దీంతో అప్రమత్తమైన భారత్‌ గిల్గిట్‌-బాల్టిస్తాన్‌ భారత భూభాగమేనని స్పష్టం చేసింది. యూరీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో కలిసి ఇలాంటి చర్యకు దిగడంపై రష్యాకు తమ ఆందోళన వ్యక్తం చేసినట్టు విదేశాంగ కార్యదర్శి వికాస్‌ స్వరూప్‌ ప్రకటించారు.

గిల్గిట్‌-బాల్టిస్తాన్‌ పరిధిలో ఉన్న రట్టు పర్వత ప్రాంతాల్లో ఉన్న పాక్‌ సైనిక స్కూల్‌లో ఈ సంయుక్త డ్రిల్స్‌ ఉంటాయని రష్యా ప్రభుత్వ వార్తాసంస్థ టీఏఎస్‌ఎస్‌ (టాస్‌) ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో చేరట్ ప్రాంతంలోనే డ్రిల్స్‌ ఉంటాయని ఢిల్లీలోని రష్యన్ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

పీవోకే ప్రాంతంలో సంయుక్త విన్యాసాలు ఉండబోవని స్పష్టం చేసింది. ఈ విషయంలో వచ్చిన కథనాలన్నీ తప్పుడువేనని తేల్చిచెప్పింది. దీంతో టాస్‌ కూడా తన కథనంలో పీవోకే ప్రస్తావనను తొలగించి తిరిగి మరొక కథనాన్ని ప్రచురించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+