'రామమందిరానికి అడ్డు చెప్పిన వారే ఇప్పుడు భక్తులుగా మారారు'
అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆపడం ఎవరితరం కాదని బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్ మంగళవారం అన్నారు. గతంలో రామ మందిర నిర్మాణానికి ఎవరైతే అడ్డు చెప్పారో ఇప్పుడు వారే రామ భక్తులుగా మారిపోయారన్నారు.
లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆపడం ఎవరితరం కాదని బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్ మంగళవారం అన్నారు. గతంలో రామ మందిర నిర్మాణానికి ఎవరైతే అడ్డు చెప్పారో ఇప్పుడు వారే రామ భక్తులుగా మారిపోయారన్నారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ముస్లిం కమ్యూనిటీ సైతం అండగా నిలిచిందని తెలిపారు. ఆయన బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ నిమిత్తం లక్నో వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

బాబ్రీ మసీదు అని చెప్పే ప్రాంతంలో ముందు నుంచి మసీదు లేదని, ఆ ప్రదేశం రామ జన్మభూమి మాత్రమేనని ఆయన అన్నారు. విదేశీయుడైన బాబర్ పేరుతో అక్కడ ఏదో కడితే, దానినే బాబ్రీ మసీదుగాసంభోదిస్తున్నారన్నారు. ఆ మసీదును కూల్చివేయడం తమకు గర్వకారణమని కూడా ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు బిజెపి నేతలు అద్వానీ, కేంద్ర మంత్రి ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి లక్నో న్యాయస్థానానికి వచ్చిన విషయం తెలిసిందే.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications