బీజేపీలో మోదీ స్థానాన్ని ఎవరూ భర్తి చేయలేరు : గడ్కరీ

న్యూఢిల్లీ : బీజేపీలో మోదీ, అమిత్‌షా ద్వయాన్ని మార్చాలనే డిమాండ్ వినిపిస్తోన్న నేపథ్యంలో .. ప్రధాని అభ్యర్థి పేరు పరిశీలనలో ఉన్న నితిన్ గడ్కరీ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోనే ముందుకెళ్తామని .. ఆయన స్థానాన్ని తనే కాదు ఎవరూ భర్తీ చేయరని స్పష్టంచేశారు.

అబ్బే అదేం లేదు ..

అబ్బే అదేం లేదు ..

మోదీ ద్వయం కాకుండా మరో ప్రధాని అభ్యర్థి కోసం ఆరెస్సెస్ అన్వేషిస్తోంది. ఇందుకోసం ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు నితిన్ గడ్కరీ. ప్రధాని అభ్యర్థిగా మీ పేరు పరిశీలిస్తున్నారని గడ్కరీని ప్రశ్నించగా .. అలాంటి ఆలోచన లేదు. ఎవరూ వారికి తోచింది రాసుకోవచ్చని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు గడ్కరీ. ఆరెస్సెస్‌కు సన్నిహితంగా ఉండేవారికి కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రశ్నకు కూడా .. అలాంటి లెక్కలు వేసుకోనని, అలాంటి ఉద్దేశ్యం కూడా తనకు లేదని స్పష్టంచేశారు. నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తనని స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మెజార్టీ సీట్లు సాధిస్తాయని స్పష్టంచేశారు.

 ఇవేం రాజకీయాలు ..?

ఇవేం రాజకీయాలు ..?

రాంమందిరానికి సంబంధించి మధ్యవర్తిత్వాన్ని రాజకీయ చేయడాన్ని తప్పుబట్టరాయన. అలాగే పాకిస్థాన్ లోని శిబిరాలపై దాడులకు రుజువు చూపాలనడం సరికాదని విపక్షాలకు సూచించారు. దీనిపై ఆయా పార్టీల వైఖరి చూసి ప్రజలు నవ్వుతున్నారని పేర్కొన్నారు.

మీకిది తగునా ?

మీకిది తగునా ?

అలాగే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ విమర్శలను తప్పుపట్టారు. ప్రధాని పదవీని రాహుల్ గౌరవించాలని సూచించారు. ప్రధాని పదవీని ప్రజలు గౌరవిస్తారని .. కానీ రాహుల్ కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+