వరల్డ్ టాప్-150లో చోటు దక్కించుకోని భారత వర్సిటీలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలతో మన దేశంలోని విశ్వవిద్యాలయాలు పోటీ పడే స్థాయిలో లేవని మరోసారి రుజువైంది.
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2018 విడుదల చేసిన అంతర్జాతీయ ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో 150 ర్యాంకింగ్స్ లోపు భారత్‌కు చెందిన ఒక్క యూనివర్సిటీ కూడా లేకపోవడం గమనార్హం.

ఈ ర్యాంకింగ్స్ ప్రకారం.. ఐఐటీ ఢిల్లీకి 172 స్థానం దక్కింది. ఐఐటీ బాంబే, ఐఐఎస్‌సీలు 179, 190 ర్యాంకులు సాధించాయి. ఇక మరే ఇతర భారత విద్యా సంస్థలు కూడా 200లోపు ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications