మా ఫ్యామిలీ ప్రధానులు ఏమి చేయలేదు..! మోడీని మించిన PM లేరు : వరుణ్ గాంధీ

లక్నో : గాంధీల వారసుడు సంచలన కామెంట్స్ చేశారు. భారతదేశంలో మోడీని మించిన ప్రధాని లేరంటూ కితాబిచ్చారు. తమ కుటుంబంలో కూడా కొందరు ప్రధానమంత్రులుగా పనిచేసినప్పటికీ.. మోడీ లాంటి పాలన ఎవరూ అందించలేదని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పార్లమెంటరీ బరిలో నిలిచిన వరుణ్ గాంధీ.. తమ ఫ్యామిలీ ప్రధానులపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

ఓట్ల వేట.. మాటల తూటా

ఓట్ల వేట.. మాటల తూటా

ఇందిరాగాంధీ మనవడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి వరుణ్ గాంధీ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిట్ క్యాంపెయిన్ లో ప్రసంగించిన వరుణ్.. మోడీని ఆకాశానికెత్తారు. ఇంతవరకు మోడీ లాంటి పాలన ఎవరూ అందించలేదని కితాబిచ్చారు.

భారత్ ను గొప్ప శక్తిగా తీర్చిదిద్దిన ఘనత మోడీకే దక్కుతుందన్న వరుణ్.. ఇలాంటి ప్రధానమంత్రిని ఇంతవరకు చూడలేదన్నారు. తమ కుటుంబం నుంచి కొందరు ప్రధానమంత్రులుగా పనిచేసినప్పటికీ.. మోడీ లాంటి పాలన అందించలేదని ఆరోపించారు. మోడీ లాగా వారు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయలేదని మండిపడ్డారు.

 అవినీతి మచ్చ లేని మోడీ.. వరుణ్ కితాబు

అవినీతి మచ్చ లేని మోడీ.. వరుణ్ కితాబు

దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడే మహానేతగా మోడీని అభివర్ణించారు వరుణ్. మోడీ తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని కొనియాడారు. ఐదేళ్ల మోడీ పాలనలో.. ఆయనపై అవినీతి మచ్చలు లేవన్నారు. కొన్ని ఆరోపణలు కొందరు కావాలని చేసినా.. అవి నిజం కాదనే విషయం ప్రూవ్ అయిందని చెప్పుకొచ్చారు. విపక్ష నేతలను ఉద్దేశించి మాట్లాడిన వరుణ్.. మోడీ ఎవరి కోసం అక్రమంగా సంపాదిస్తారు, ఆయనకేమైనా ఫ్యామిలీ ఉందా అంటూ ప్రశ్నించారు.

ఎన్నికల వేడి.. వరుణ్ ముద్ర

ఎన్నికల వేడి.. వరుణ్ ముద్ర

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాటల వేడి పెంచారు వరుణ్ గాంధీ. మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ కాంగ్రెస్ నేతలను పరోక్షంగా టార్గెట్ చేశారు. పిలిభిట్ పార్లమెంటరీ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వరుణ్.. ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేల్చుతున్నారు. లోక్‌సభ 3వ విడత ఎన్నికల్లో భాగంగా.. ఈ నెల 23వ తేదీన యూపీలో ఎలక్షన్లు జరగనున్నాయి. ఇప్పటివరకు సైలెంట్ గా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు వరుణ్. అయితే తాజాగా మోడీని మించిన ప్రధాని లేరంటూ వ్యాఖ్యానించడం.. తమ కుటుంబం నుంచి ప్రధానమంత్రులుగా వ్యవహరించినవారు సైతం మోడీ లాగా పనిచేయలేదని ఆరోపించడం హాట్ టాపిక్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+