ఏం పరవాలేదు..!ఆమె మంచి డాన్సర్ !నృత్యంతో అలరిస్తుందని జయప్రదను ఎద్దేవా చేసిన ఎస్పీ నేత ..!!
రాంపూర్/హైదరాబాద్ : బీజేపి నేతల పరిచయాలు కూడా పూర్తిగా కాక ముందే జయప్రదకు అవమానాలు మాత్రం జరుగుతున్నాయి. తన ప్రత్యర్థి పార్టీ నేత, జయప్రద మనో భావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరిన మాజీ ఎంపీ, నటి జయప్రదపై ఎస్పీ నేత ఆజం ఖాన్ సన్నిహితుడు, ఆ పార్టీ సంభాల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద యూపీలోని రాంపూర్ నుంచి ఎస్పీ నేత ఆజం ఖాన్‌తో తలపడతారని భావిస్తున్న సంగతి తెలిసిందే. రాంపూర్ ప్రజలను జయప్రద తన నృత్యాలతో ఆకట్టుకుంటారని ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. జయప్రదను చూసేందుకు తమ జిల్లా ప్రజలు రాంపూర్‌కు తరలివెళతారని హేళనగా వ్యాఖ్యనించారు.

జయప్రద గతంలో ఎస్పీ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం బీజేపీలో చేరి గతంలో తమ పార్టీ సహచరుడు ఎస్పీ నేత ఆజం ఖాన్‌పై రాంపూర్ నుంచి పోటీ చేయనున్నారు. కాగా గతంలో ఆజం ఖాన్ సైతం జయప్రదపై అభ్యంతరకర వ్యాక్యలు చేశారు. మరోవైపు జయప్రదను ఎస్పీలోకి తీసుకువచ్చి రాంపూర్ లోక్‌సభ స్ధానం నుంచి గెలుపొందేలా ఆజం ఖాన్ చొరవ చూపడం గమనార్హం. అయితే జయప్రద ఎస్పీ మాజీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ వర్గంలో చురుకుగా వ్యవహరించడంతో వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రదకు వ్యతిరేకంగా ఆజం ఖాన్ వర్గీయులు ప్రచారం చేశారు. ఇక ఆజం ఖాన్ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా జయప్రద ఇప్పటికే రాంపూర్ నుంచి రెండు సార్లు గెలుపొందారు.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications