వింత శిక్ష: బహిర్భూమికి వెళ్లినందుకు రేషన్ కట్.. తప్పు చేస్తే సంక్షేమ పథకాల నుంచి పేర్లు తొలిగింపు..

భువనేశ్వర్: మహిళల బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి ఓ వింత శిక్షను అనుసరిస్తోంది ఓ గ్రామం. బహిర్భూమికి వెళ్లిన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకుంటోంది. చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా అయ్యే నిత్యావసర సరుకులను నిలిపివేసింది. క్రమంగా పింఛన్, ఇతర సంక్షేమ పథకాల నుంచి వారి పేర్లను తొలగించేలా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతోంది. ఆ గ్రామం పేరు గౌతమి. ఒడిశాలోని గంజాం జిల్లా సంఖేముండి బ్లాక్ పరిధిలో ఉంటుందీ గౌతమి గ్రామం.

బహిరంగ మల విసర్జనను స్వచ్ఛందంగా నిషేధించారు గ్రామస్తులు. కిందటి నెల 20వ తేదీన ఓ తీర్మానాన్ని కూడా చేశారు. అయినప్పటికీ.. దీన్ని ఉల్లంఘించి బహిర్భూమికి వెళ్లిన 20 కుటుంబాలకు చెందిన మహిళలకు రేషన్ ను నిలిపివేశారు. బహిర్భూమికి వెళ్లే వారిని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా వేశారు. స్వయం సహాయక బృందానికి చెందిన కొందరు మహిళలు గ్రూపుగా ఏర్పడి బహిర్భూమి విధానాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది. ఏ మహిళైనా బహిర్భూమికి వెళ్లినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ సర్పంచ్ సుశాంత్ స్వైన్ వెల్లడించారు.

No ration to 20 Families for defecating in open in Ganjam

ఈ నిబంధనను అతిక్రమించిన 20 కుటుంబాలకు రేషన్ ను నిలిపివేశారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ అధికారికంగా వెల్లడించారు. తాము బహిర్భూమికి వెళ్లబోమంటూ మహిళలు క్షమాపణ పత్రాన్ని రాసి ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తరువాతే నిత్యావసర సరుకులను సరఫరా చేస్తామని వెల్లడించారు. వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన కల్పించడం, గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే తాము ఈ తీర్మానం చేశామని, ఇందులో మరే ఉద్దేశం లేదని సుశాంత్ స్వైన్ తెలిపారు. పదే పదే అదే తప్పును చేస్తే.. పింఛన్ వంటి సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితా నుంచి వారి పేర్లను తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+