మోడీ ప్రేరణ: ఆ వరుడితో పెళ్లి రద్దు చేసిన వధువు!
కాన్పూర్: పెళ్లికి ముందే మాటిచ్చి ఆ మాటపై నిలబడని పెళ్లి కొడుకును తిరస్కరించింది వధువు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ యువతికి మరో వరుడితో పెళ్లి చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సామూహిక వివాహాల్లో నేహా అనే యువతికి పెళ్లికి సిద్ధమయింది. అయితే పెళ్లికి ముందే ఇంట్లో మరుగుదొడ్డి కట్టిస్తానన్న హామీని వరుడు నిలుపుకోలేకపోయాడు. దీంతో అతడిని పెళ్లాడేందుకు నేహా నిరాకరించింది.

అతడిని పెళ్లిచేసుకోనని తెగేసి చెప్పింది.అదే పెళ్లిపందిట్లో తనను పెళ్లాడేందుకు ముందుకు వచ్చిన మరో యువకుడిని ఆమె పెళ్లాడింది. అతడి ఇంట్లో టాయిలెట్ ఉండటంతో వివాహం చేసుకుంది.
ఇంట్లో మరుగుదొడ్డి అనేది కనీస అవసరమని నేహా పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 'స్వచ్ఛ భారత్' నుంచి ప్రేరణ పొందాలని ఆమె సూచించింది.
Kanpur (UP): A woman called off her wedding with a man after he failed to get a toilet built at his residence. pic.twitter.com/3NCW814Az8
— ANI UP (@ANINewsUP) April 17, 2016
We must do our bit to give impetus to PM Modi's "Swacch Bharat" initiative. Having toilet built at home is a basic need: Neha
— ANI UP (@ANINewsUP) April 17, 2016












Click it and Unblock the Notifications