పోరే కాదు: ప్రియాంక, వరుణ్ వాగ్యుద్ధంపై మేనకా గాంధీ

ఎన్నికలు జరుగుతున్నాయని, వరుణ్ గాంధీ తన తండ్రి సిద్ధాంతాల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, వరుణ్ గాంధీ ఎన్నికల పోరాటాన్ని తాను ఆహ్వానిస్తున్నానని, క్లిష్టమైన ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు తాను వరుణ్ గాంధీని ప్రశంసిస్తున్నానని ఆమె అన్నారు.
వారిద్దరి వాగ్యుద్ధం ఏ విషయాల మీద జరిగిందో తనకు తెలియదని ఆమె అన్నారు. వారు వారి ఎన్నికల పోరాటం చేస్తున్నారని, తన కుమారుడు తన పోరాటం చేస్తున్నాడని ఆమె అన్నారు. సంజయ్ గాంధీ వారసత్వం కోసం పోరాడుతున్నారా అని అడిగితే తాను తన కుమారుడి విషయంలో, తన భర్త విషయంలో గర్వంగా ఫీలవుతున్నానని ఆమె అన్నారు.
తన కుమారుడు తన తండ్రి నియోజకవర్గంలో పోటీ చేయడం గర్వంగా ఉందని మేనకా గాంధీ చెప్పారు. వరుణ్ పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారో చూడడానికి తాను ఆ నియోజకవర్గానికి వెళ్లాలని అనుకున్నట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications