"ఆ విషయంలో పాకిస్థాన్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చు"
జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ. వెయిద్ పాకిస్థాన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. యూనైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అబద్దాల్లో పాకిస్థాన్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. సొంత ప్రజలపై దాడులు చేస్తున్న పాకిస్థాన్ ఆర్మీ, అక్కడి ప్రభుత్వాన్ని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం పాక్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించింది. టెర్రరిజాన్ని పెంపొందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై భారత్ మండిపడింది.
యూనైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ. వెయిద్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పాక్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అబద్దాల్లో పాకిస్థాన్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆర్మీ, అక్కడి ప్రభుత్వం.. సొంత ప్రజలపై దాడులకు పాల్పడుతోందని అన్నారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..యూనైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మే లో భారత్ తమపై దాడి చేసిందని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే ఆ దేశం ఎటాక్ చేసిందన్నారు. ఆ యుద్ధంలో భారత్ కు చెందిన 7 ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామని కీలక ఆరోపణలు చేశారు. భారత్ శత్రుదేశం అని సంబోధించారు.
అలాగే భారత్ లోని హిందూత్వ ఆధారిత తీవ్రవాదం ప్రపంచానికి ప్రమాదకరమని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ ప్రపంచంలో ఏ మనిషి, మతం పట్ల హింస, ద్వేషానికి చోటు లేదు. భారత్ లోని హిందుత్వ అతివాదం ప్రపంచానికే ప్రమాదకరంగా మారింది. ఇస్లాంపై దాడులు చేసే శక్తులను ఎదుర్కోవాలి అని యూనైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.

ఇదిలాఉంటే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను యూఎన్ లో భారత ప్రతినిధి పేటల్ గెహ్లోత్ తప్పుబట్టారు. టెర్రరిస్టు క్వాంపులను నిర్వహిస్తూనే శాంతి కోరుకుంటున్నామని పీఎం అబద్దాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పహల్గాం ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం, వారి స్థావరాలపై దాడులను ప్రపంచం చూసిందన్నారు. ఉగ్రవాదంపై పోరాడతామంటూ ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయమిచ్చారని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications