Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వామ్మో.. టిక్‌టాక్ వీడియోలకు లైకులు రావడం లేదని యువకుడి ఆత్మహత్య...

టెక్నాలజీ తీసుకొచ్చిన తంటా ఏమో కానీ యువతలో.. మంచి, మాట లేదు. పలకరింపులు లేవు. వాట్సాప్, టిక్ టాక్ అంటూ గడిపేస్తున్నారు. అయితే నోయిడాలో ఓ యువకుడు ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తన వీడియోకు లైకులు రాకపోవడమేనని తెలిసి.. పేరంట్స్, స్థానికులు నోరెళ్లబెట్టారు.

పశ్చిమబెంగాల్ మల్దాకు చెందిన నూర్ ఇక్బాల్ కుటుంబం ఉపాధి కోసం నోయిడా వెళ్లింది. సలార్‌పూర్ గ్రామంలో ఉంటుంది. అయితే 18 ఏళ్ల నూర్.. మాత్రం ఎప్పుడూ టిక్ టాక్‌లో మునిగిపోయేవాడు. రకరకాల వీడియోలు చేస్తూ బిజీగా ఉండేవాడు. కానీ దానికి ఆశించిన స్థాయిలో లైకులు రాకపోవడంతో.. ఆందోళనకు గురయ్యాడు.

Noida teen commits suicide as Tik Tok videos fail to get likes

తన వీడియోలకు లైకులు రావడం లేదని స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి కూడా కోరారు. అయినా లైకులు రాలేదు. దీంతో ఆందోళనకు గురైన యువకుడు.. ఆత్మహత్య చేసుకున్నాడు. తన గదిలో ఉరేసుకొని చనిపోయాడు. ఈ నెల 16వ తేదీన సాయంత్రం ఉరేసుకోగా.. వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. తలుపులు బద్దలుకొట్టి మరీ ప్రవేశించారు. కానీ అప్పటికే యువకుడు చనిపోయాడు. అతని మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Recommended Video

    Lockdown : AP CM YS Jagan Urges Muslims To Do Ramzan Prayers @ Home

    లాక్ డౌన్ వల్ల యువకుడు, అతని తండ్రి ఇంట్లోనే ఉంటున్నారు. ఇంతలోనే సూసైడ్ చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కుమారుడిని తండ్రి ప్రేమగా చూసుకుంటున్నాడని, అడిగిన అన్నింటినీ కొనిచ్చేవాడని చెబుతున్నారు. కానీ ఆ తండ్రికి కడుపుకోత మిగిల్చాడని పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+