దొంగలు పడ్డ ఆర్నెల్లకు.. అన్న చందంగా ఇప్పుడు సోనూసూద్కు రైల్వే శాఖ వార్నింగ్
దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగిన చందంగా.. గతేడాది సోనూసూద్ చేసిన వీడియో పై ఈ ఏడాది రైల్వేశాఖ స్పందించింది. బాలీవుడ్ యాక్టర్, కరోనా మహమ్మారి తర్వాత దేశ ప్రజలలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన రీల్ స్టార్ విలన్ .. రియల్ హీరో సోను సూద్ కు రైల్వే శాఖ వార్నింగ్ ఇచ్చింది. చాలామందికి రోల్ మోడల్ అయిన సోనూసూద్ ఇటువంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడడం సరికాదని, గతంలో సోనూసూద్ కి సంబంధించిన రైల్లో ప్రయాణం చేస్తున్న ఒక వీడియోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.
సోనూ సూద్ రైలు వీడియో పై స్పందించిన ఉత్తర రైల్వే.. ఏమందంటే
సోను సూద్ రైల్లో ఫుట్ బోర్డు వద్ద కూర్చొని ప్రయాణం చేస్తున్నట్లు ఉన్న వీడియో పైన స్పందించిన ఉత్తర రైల్వే శాఖ సోను సూద్ వీడియో దేశానికి తప్పుడు సందేశాన్ని ఇస్తుందని అభిప్రాయపడింది. దేశంలోని, ప్రపంచంలోని లక్షలాది మందికి రోల్ మోడల్ అయిన మీరు రైలు ఫుట్ బోర్డు పై ప్రయాణం చేయడం ప్రమాదకరమని, ఈ రకమైన వీడియో మీ అభిమానులకు తప్పుడు సందేశాన్ని ఇస్తుందని, దయచేసి ఇలా చేయకండి అంటూ రైల్వే శాఖ పేర్కొంది. ప్రశాంతంగా సురక్షితమైన ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి అంటూ ఉత్తర రైల్వేశాఖ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది.

గతేడాది సోనూ రైలు వీడియో పై నెటిజన్ల విమర్శలు
2022 డిసెంబర్ 13వ తేదీన సోను సూద్ ఒక రైల్లో ఫుట్ బోర్డు పై ప్రయాణిస్తున్న వీడియోను ట్వీట్ చేశారు. ఇక ఆ వీడియో పై నెటిజన్లు సోనూసూద్ కు షాక్ ఇచ్చారు. అలా ప్రయాణం చేయడం మంచిది కాదని సూచించారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న యువత మీలాగా స్టంట్స్ చేసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంతోమందికి రోల్ మోడల్ గా ఉన్న మీరు ఇటువంటివి చేయడం మంచిది కాదని సూచించారు. కదులుతున్న రైలు డోర్ దగ్గర కేవలం మునివేళ్ల మీద కూర్చొని బయటకు చూడటం అత్యంత ప్రమాదకరమని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటువంటి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలన్నారు.

ఈ ఏడాది స్పందించిన ఉత్తర రైల్వే
డిసెంబర్ 13న సోనూ సూద్ పోస్ట్ చేసిన వీడియో పై దేశ ప్రజల్లో అప్పట్లోనే పెద్ద చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియో పైన విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇక అప్పుడే స్పందిస్తుంది అని అంతా భావించిన రైల్వే శాఖ నింపాదిగా కొత్త సంవత్సరంలో స్పందించింది. జనవరి 4న ఒక ట్వీట్ చేసి సోనూ సూద్ ను హెచ్చరించింది. ఇలాంటి చర్యలు ప్రమాదకరమని సూచించింది. మొత్తానికి రైల్వే శాఖ ఇప్పుడు స్పందించటం కూడా సోషల్ మీడియాలో చర్చకు కారణం అయ్యింది. ఇంత త్వరగానా స్పందిస్తే.. అని సెటైర్లు పడుతున్నాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications