బస్తర్ అడవుల్లో ప్రధాని మోదీ

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా బలగాల మధ్య దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకొంటోన్నారు. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా పేరుగాంచిన బస్తర్ అడవుల్లో జవాన్లతో గడిపారు. వారిని ఉద్దేశించి మాట్లాడారు. జవాన్ల అపార ధైర్యసాహసాలను కొనియాడారు. 140 కోట్ల మంది భారత పౌరుల తరఫున సైనికులు, వారి కుటుంబాలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

దశాబ్దాల పాటు నక్సల్స్ భయాందోళనల మధ్య గడిపిన ఈ ప్రాంత ప్రజల్లో నూతన ఆశలు చిగురించాయని, బస్తర్ వంటి ప్రాంతాల్లో అభివృద్ధికి నూతన అధ్యాయం ప్రారంభమైందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. సుదీర్ఘ కాలం పాటు వేధించిన మావోయిస్టుల సమస్యలను నిర్మూలించామని, మవోయిస్ట్ రహిత శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. దేశంలోని ప్రతీ జిల్లా నక్సలిజం కోరల నుంచి విముక్తి పొందిందని స్పష్టం చేశారు.

Not a single tear was shed by them says PM Modi celebrates Diwali in Bastar with secuirty personnel

దేశ సరిహద్దుల వద్ద పనిచేసే సైనిక బలగాలతో సమానంగా దేశంలోపల శాంతిభద్రతలను పరిరక్షిస్తున్న భద్రతా సిబ్బంది పాత్ర ఎంతో కీలకమైనదని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నక్సలిజం పట్ల సరైన వ్యూహం లేకపోవడం వల్ల అమాయక పౌరులు, జవాన్లు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. 2004 నుంచి 2013 మధ్య కాలంలో ఎంతోమంది భద్రతా సిబ్బంది అమరులయ్యారని చెప్పారు.

ఆ సమయంలో నక్సలిజం ఒక నయం చేయలేని వ్యాధిగా భావించి వదిలేశారని, దాంతో దశాబ్దాల పాటు హింస కొనసాగిందని ప్రధాని మోదీ అన్నారు. 2010 నాటి దంతెవాడ ఘోరకలిని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాటి దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు విడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ లోనే 1,000 మందికి పైగా జవాన్లు ప్రాణత్యాగం చేశారని, అయినప్పటికీ నాటి పాలకుల నుంచి ఆవేదన గానీ, సరైన స్పందన గానీ కరువైందని ధ్వజమెత్తారు.

Not a single tear was shed by them says PM Modi celebrates Diwali in Bastar with secuirty personnel

2014లో అధికారం చేపట్టిన తర్వాత మావోయిజం నిర్మూలనకు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భద్రతా దళాలకు పూర్తిస్థాయి స్వేచ్ఛను అందించడం ద్వారా పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, నక్సలైట్లకు అందుతున్న ఆర్థిక మూలాలు, నకిలీ నోట్ల చెలామణిని అడ్డుకోవడం, వారికి ఆయుధాలు అందకుండా సరఫరా వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశామని అన్నారు.

రూట్ మార్చిన ప్రధాని మోదీ: సరిహద్దులకు బదులుగా మావోయిస్టుల కంచుకోటలో
రూట్ మార్చిన ప్రధాని మోదీ: సరిహద్దులకు బదులుగా మావోయిస్టుల కంచుకోటలో

సరైన విధానాలు, పటిష్ట చర్యల ఫలితంగా గత ఏడాది కాలంలో విధి నిర్వహణలో ఒక్క సీఆర్‌పీఎఫ్ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోకపోవడం ఈ చారిత్రాత్మక విజయానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని, గతంలో ఓటు హక్కును కూడా వినియోగించుకోలేకపోయిన ప్రజలు ఇప్పుడు ధైర్యంగా నిలబడుతున్నారని చెప్పారు. ఈ విజయం వెనుక భద్రతా బలగాల సహనం, ధైర్యం, త్యాగాలు ఉన్నాయని ప్రశంసించారు.

ఇంకాస్సేపట్లో స్టాక్ మార్కెట్ లో ముహూరత్ ట్రేడింగ్- లక్ష్మీపూజ
ఇంకాస్సేపట్లో స్టాక్ మార్కెట్ లో ముహూరత్ ట్రేడింగ్- లక్ష్మీపూజ

దేశంలో అంతర్గత భద్రత పటిష్టం చేయడంతో పాటు పేదరిక నిర్మూలనలోనూ అద్భుతమైన ప్రగతిని సాధిస్తోన్నామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వివరించారు. 12 సంవత్సరాల వ్యవధిలో దేశంలో సుమారు 50 కోట్ల మంది కటిక దారిద్ర్యం నుంచి నుంచి బయటపడ్డారని అన్నారు. ప్రపంచ బ్యాంక్ నివేదికను ఆయన ఉదాహరించారు. దేశంలో శాంతిభద్రతలు నెలకొనడం వల్లే సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరాయని, అభివృద్ధి ఫలాలు ప్రతీ ప్రాంతానికి అందుతున్నాయని చెప్పారు.

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు స్వయంగా సీఆర్పీఎఫ్, భద్రత బలగాలకు సహకరిస్తూ దేశ సమగ్రత కోసం నిలబడ్డారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సరిహద్దుల్లో దేశాన్ని రక్షించే సైనికులతో పాటు దేశం లోపల అహర్నిశలు శ్రమించే భద్రతా బలగాల సేవలు చిరస్మరణీయమని, వారి వల్లే కోట్లాది మంది ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోగలుగుతున్నారని అన్నారు. భద్రతా బలగాలు చేసిన త్యాగాలు వృథా పోలేదని, నక్సలిజం రహిత దేశంగా భారత్ ఆవిర్భవించిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+