ఒకసారి ఎంటరైతే తప్పించుకోలేరు: బ్లూవేల్ గేమ్‌పై సూసైడ్ నోట్
బ్లూవేల్ గేమ్ మరో ప్రాణాన్ని బలిగొంది. మధురైకి చెందిన 19 ఏళ్ల యువకుడు ఈసారి బాధితుడు. ఈ గేమ్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఆడుతున్న విగ్నేష్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మధుర: బ్లూవేల్ గేమ్ మరో ప్రాణాన్ని బలిగొంది. మధురైకి చెందిన 19 ఏళ్ల యువకుడు ఈసారి బాధితుడు. ఈ గేమ్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఆడుతున్న విగ్నేష్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అంతకుముందు ఓ లేఖ రాశాడు. 'బ్లూ వేల్.. ఇదో ప్రమాదకరమైన ఆట. ఒకసారి ఎంటర్ అయితే, ఎన్నటికీ బయటకు వెళ్లలేరు' అని తనువు చాలించాడు.

ఓ ప్రయివేటు కాలేజీలో రెండో సంవత్సరం కామర్స్ చదువుతున్న విగ్నేష్, గత కొంతకాలంగా ఎక్కువ సేపు ఫోన్ తోనే గడుపుతున్నాడని అతని స్నేహితులు పోలీసు విచారణలో వెల్లడించాడు.
తమిళనాడులో బ్లూవేల్ గేమ్ కారణంగా నమోదైన తొలి మరణం ఇదే. ఇప్పటికే ముంబై, ఉత్తర ప్రదేశ్, కేరళ తదితర ప్రాంతాల్లో పలువురు మృత్యువాత పడగా, చాలా రాష్ట్రాలు ఈ గేమ్‌ను నిషేధించాయి.
రష్యాలో పుట్టిన ఈ గేమ్ ఇప్పటివరకూ సుమారు 100 మందిని పైగా బలిగొంది. టీనేజర్లు, ముఖ్యంగా చిన్నారులు ఈ గేమ్‌కు అలవాటు పడి ఆత్మహత్య ఆలోచనవైపు వెళుతున్నారు.
ఓ ప్రయివేటు చాట్ మోడ్ ఆధారిత గేమ్‌లో, చేతులు కోసుకోవడం, ఒంటరిగా ఉండటం, స్మశానాల్లో గడపడం, హారర్ సినిమాలు చూడటం వంటి 50 టాస్కులు ఉంటాయి. వీటికి సంబంధించిన సెల్ఫీలను అప్ లోడ్ చేస్తుండాలి.
భవంతి పైనుంచి దూకాలన్న టాస్క్‌లో భాగంగా పలువురు మరణిస్తున్న పరిస్థితి. ఈ గేమ్‌కు ఓ ప్రత్యేక సైట్ గానీ, యాప్ గానీ లేకపోవడంతో దీన్ని ఆడుతున్న వారి ట్రాకింగ్ క్లిష్టమైన పని అని సైబర్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications