50 శాతం వీవీ ప్యాట్ స్లిప్‌లను లెక్కిస్తే ఇంతే సంగతులు ...

ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టు 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కిస్తే ఫలితాలు రావాడానికి కనీసం ఆరు రోజులు పడుతుందని తేల్చి చెప్పింది ఎన్నికల కమీషన్, అలాగే ఫలితాలు వెలుడేందుకు నెలల తరబడి సమయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు వేసిన పిటిషన్ కు సమాధానం ఇచ్చింది ఎన్నికల కమీషన్ .

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో వీవీ ప్యాట్ స్లిప్ లను ప్రవేశపెట్టిన ఈసీ

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో వీవీ ప్యాట్ స్లిప్ లను ప్రవేశపెట్టిన ఈసీ

ఇటివల ఎన్నికల కమీషన్ చేపట్టిన ఈవీఎం మిషన్లతో పాటు వీవీప్యాట్ స్లిప్ లను ప్రవేశపెట్టింది. దీంతో ఎన్నికల్లో ఫలితాల లెక్కింపులో ప్రతి నియోజకవర్గానికి గాను ఒక్క ఈవీఎం లోని వీవీ ప్యాట్ స్లిప్ లను మాత్రమే లెక్కబెట్టి సరిచూస్తుంది.అనంతరం ఫలితాలను వెలువరుస్తోంది.అయితే వీటీ ద్వార సరైన ఫలితాలు రావడం లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు , దీంతో ఈవీఎం లలో ట్యాంపరింగ్ జరుగుతుందని దేశంలోని పలు పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.

50 శాతం వీవీ ప్యాట్ స్లిప్ లెక్కించాలని సుప్రింలో పీటీషన్

50 శాతం వీవీ ప్యాట్ స్లిప్ లెక్కించాలని సుప్రింలో పీటీషన్

ఈ నేఫథ్యంలోనే ఇటివల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పలు అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేశారు. దీంతో ప్రతి నియోజకవర్గానికి 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కించాలని కోరుతూ 21 పార్టీల ప్రతినిధులు సుప్రిం కోర్టును ఆశ్రయించారు,దీంతో గత వారం ఈ కేసును విచారించిన సుప్రిం కోర్టు ప్రతిపక్ష పార్టీలు కోరినట్టు 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించడంతో ఈసీకి ఉన్న ఇబ్బందులు ఏమీటని ప్రశ్నించింది.ఇందుకోసం తీసుకుంటున్న చర్యలు తెలపాలని,దీనీపై సమగ్ర నివేదిక అందించాలని ఈసిని ఆదేశించింది.

టాంపరింగ్ పై పార్టీలు సరైన ఆధారాలు చూపలేదు ఈసి

టాంపరింగ్ పై పార్టీలు సరైన ఆధారాలు చూపలేదు ఈసి

ఇందుకు సంబంధించిన నివేదికలో ఒక నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూగ్ కు చెందిన వీవీ ప్యాట్ స్లిప్పుల కౌంటింగ్ చేస్తున్నామని ,ఇది సరైన విధానమేనని ఇది తమ ఆధ్యయనంలో తేలిందని పేర్కోన్నారు. దీనివల్ల ఎన్నికలపై ప్రతికూల ప్రభావానికి సంబంధించి పార్టీలు ఒక్క ఉదహారణ కూడ చూపలేదని తెలిపాయి. ఏ ఆధారంతో దీన్ని మార్చాలని కోరుతున్నాయో చెప్పలేకపోతున్నాయని తన సమాధానం లో తెలిపింది. కాగా వీటీపై పార్టీల అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పింది. కాగా ఈనెల 11 నే పోలీంగ్ ఉన్నందున ఎలాంటీ మార్పులు చేయడం సాధ్యం కాదని తెలిపింది. మరోవైపు పార్టీలు కోరుతున్నట్టుగా 50 శాతం వీవీప్యాట్ స్లిప్పుులు లెక్కపెట్టాంటే కనీసం ఆరు రోజులు పడుతుందని , తెలిపింది. మరోవైపు వీవీప్యాట్ స్లిప్ ల లెక్కింపు చేపడితే సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు వారి సంఖ్యను పెంచాలని తెలిపింది.

వారంలోగా పార్టీలు సమాధానం చెప్పాలి, సుప్రిం

వారంలోగా పార్టీలు సమాధానం చెప్పాలి, సుప్రిం


కాగా ఇదివరకే పార్టీల వాదనలు విన్న సుప్రిం కోర్టు ఎలక్షన్ కమీషన్ కు పార్టీలు లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ ధాఖలు చేయడంతో ,ఈసి సమర్పించిన అఫిడవిట్ అంశాలపై వారంలోగా అఫిడవిట్ ధాఖలు చేయాలని 21 పార్టీలకు సుప్రిం కోర్టు ఆదేశాలు జారిచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+