ఫిజిక్స్ పరీక్ష: సన్నద్ధం కాలేదని విద్యార్థి ఆత్మహత్య

 Not prepared for exam, boy hangs self
లక్నో: పరీక్షలకు సరైన రీతిలో సన్నద్ధం కాలేకపోయానని ఆందోళనకు గురైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాధ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో మంగళవారం చోటు చేసుకుంది. జార్జి రాజ్ రాయల్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆకాశ్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి బుధవారం ఉదయం ఫిజిక్స్ పరీక్ష ఉంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఆకాశ్ తన తల్లిదండ్రులతో కలిసి లక్నోలోని వృందావన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆకాష్ మంగళవారం హిస్టరీ పరీక్ష రాసి ఇంటికి వచ్చాడు. ఆ రోజు సాయంత్రం మందుల కోసమని అతని తల్లి బయటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆకాష్.. బుధవారం నాటి ఫిజిక్స్ పరీక్షకు సరైన విధంగా సన్నద్ధం కాలేకపోయాననే ఆందోళనలతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తిరిగి ఇంటికి వచ్చిన ఆకాశ్ తల్లి.. కిటికి గ్రిల్‌కు ఉరివేసుకుని విగత జీవిగా పడివున్న ఆకాశ్‌ను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన కొడుకును కాపాడాలని ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అతన్ని కిందికి దించి ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆకాశ్ మృతి చెందాడని వైద్యులు చెప్పారు. దీంతో ఆకాశ్ తల్లి తీవ్రంగా రోదించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఆకాశ్ ఇంటికి చేరుకున్నారు. ఫిజిక్స్ సబ్జెక్టుపై అతనికి అంతగా పట్టు లేదని, దీంతో అసంతృప్తి, ఆందోళనకు గురైన ఆకాశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆకాశ్ తండ్రి షాహ్జాన్‌పూర్ నగరంలో ఉన్నట్లు చెప్పారు. ఆకాశ్‌కు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. ఆకాశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+