భారత మార్కెట్లోకి Nothing phone 2: ఫీచర్లు మామూలుగా లేవుగా!, ధర ఎంతంటే?

హైదరాబాద్: మొబైల్ ఫోన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 2 భారత మార్కెట్లోకి ఎట్టకేలకు అడుగుపెట్టింది. ఈ ఫోన్లకు సంబంధించి ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. యూకేకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం నథింగ్ టెక్నాలిజీ లిమిటెడ్ ఈ ఫోన్లను తయారు చేస్తోంది. నథింగ్ ఫోన్ 2 సరికొత్త డిజైన్లో మార్కెట్లోకి వచ్చింది. చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతోపాటు ఫీచర్లు కూడా అదిరిపోయాయి.

నథింగ్ సిరీస్‌లో వచ్చిన తొలి ఫోన్ అమ్మకాలు భారీగా జరగడంతో తాజాగా నథింగ్ ఫోన్ 2 ను మరిన్ని కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. నథింగ్ ఫోన్ 2 జులై 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఫోన్లకు బుకింగ్ ప్రారంభమైంది. రిటైల్ ఔట్‌లెట్లలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి ఫీచర్లకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

 Nothing phone-2

6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో నథింగ్ ఫోన్ 2 పెద్ద డిస్‌ప్లేను కలిగివుంది. 1080X2412 పిక్సెల్ రెజల్యూషన్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.0తో నథింగ్ ఫోన్ 2 స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. నథింగ్ ఫోన్ 2 క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్లో మూడు కెమెరాలున్నాయి. వెనుక వైపు రెండు 50 ఎంపీ కెమెరాలు, ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. దీంతో ఫొటోలు మంచి క్లారిటీతో వస్తాయి.

అంతేగాక, ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సెల్ అందిస్తుండటంతో సెల్ఫీలు కూడా అద్భుతంగా తీసుకోవచ్చు. మూడు హై-డెఫినేషన్ మైక్రోఫోన్లు, రెండు స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఉబెర్, జొమాటో వంటి థర్డ్ పార్టీ యాప్‌ల పికప్, డెలివరీలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఫోన్లో ప్రొగ్రెస్ బార్‌లు ఇస్తున్నారు.

వేరియంట్లను బట్టి ఈ ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి..
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 44,999
12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ధర రూ. 49,999
12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 54,999గా నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+