రైల్వే ప్రయాణికులకు శుభవార్త! భీమ్, యూపీఐ యాప్‌ల ద్వారా టిక్కెట్ల బుకింగ్..
రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం రైల్వే టికెట్ బుకింగ్‌ను మరింత సరళతరం చేసింది. ఇకపై భీమ్, యూపీఐ యాప్‌ల ద్వారా టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం రైల్వే టికెట్ బుకింగ్‌ను మరింత సరళతరం చేసింది. ఇకపై భీమ్, యూపీఐ యాప్‌ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది.
డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం ఈ మేరకు చర్యలు చేపట్టింది. కేంద్రం నిర్ణయంతో లక్షలాది మంది రైల్వే ప్రయాణికులకు ఊరట కలగనుంది.

దేశంలోని అన్ని టికెట్ రిజర్వేషన్ కౌంటర్లలో శుక్రవారం నుంచే యూపీఐ చెల్లింపు వ్యవస్థను అమలు చేయనున్నట్టు ఇండియన్ రైల్వే గురువారం ప్రకటించింది. ప్రయాణికులు తమ టికెట్ బుకింగ్ కోసం ఇకపై క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించాల్సిన అవసరం ఉండదని రైల్వే బోర్డు సభ్యుడు మొహమ్మద్ జంషెడ్ తెలిపారు.
మొబైల్ లోని భీమ్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని, దీనికోసం అవసరమైన క్యూఆర్ కోడ్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన వివరించారు. యూపీఐ చెల్లింపుల కోసం దేశవ్యాప్తంగా 14 వేల కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 7.5 లక్షల రైల్వే టికెట్లు బుక్ అవుతుండగా దాదాపు 97 శాతం బుకింగ్‌లు నగదు చెల్లింపుల ద్వారా జరుగుతున్నాయని, కేవలం మూడు శాతం మాత్రమే డిజిటల్ రూపంలో జరుగుతున్నాయని జంషెడ్ వివరించారు.
-
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
DA Hike: డీఏ ప్రకటనకు ముహూర్తం ఖరారు?.. వచ్చే వారమే గుడ్ న్యూస్ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
Free Ipl Tickets: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు -లింక్ షేర్ చేసిన బెంగళూరు పోలీసులు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం











Click it and Unblock the Notifications