వండర్: భారత్ రైళ్లలో పెళ్లిళ్లు, హనీమూన్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: విలావంతంగా, వినూత్నంగా వివాహం చేసుకోవాలనుకునే జంటలకు భారతీయ రైల్వేకు చెందిన క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ ఓ శుభవార్త చెప్పింది. లగ్జరీ రైళ్లలో పెళ్లి వేడుకలు నిర్వహించడానికి సిద్దం అయ్యింది.
లగ్జరీ రైళ్లను పెళ్లి వేడుకలకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కార్పొరేషన్ ప్రపంచ పర్యాటకుల కోసం లగ్జరీ, సెమి లగ్జరీ రైళ్లు ఇప్పటికే నడుపుతుంది. వీటిలో అత్యంత ఖరీదైన మహారాజ ఎక్స్ ప్రెస్ రైలులో 8 రోజుల ప్రత్యేక ప్యాకేజీ ఉంది.

ప్రత్యేక ప్యాకేజీ
ఈ ప్రత్యేక ప్యాకేజీలో ఢిల్లీ, ఆగ్రా, రంథంబోర్, బికనూర్, జైపూర్, జోధ్ పూర్, ఉదయ్ పూర్, బెలాసినార్ కోటలు, చారిత్ర కట్టడాల పర్యాటకుల సందర్శన కోసం రైళ్లను నడుపుతున్నది.

పెళ్లిళ్ల కోసం
ఇప్పుడు విలాసవంతమైన పెళ్లిళ్ల కోసం మహారాజ ఎక్స్ ప్రెస్ తోపాటు ఆన్ వీల్స్, డెక్కన్ ఒడిస్సీ, గోల్డెన్ చారియట్, రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ రైళ్లు కేటాయించాలని కార్పొరేషన్ నిర్ణయించింది.

డెకరేషన్ లో మార్పులు
పెళ్లిళ్లకు, వేడుకలకు అనుగుణంగా ఎప్నటికప్పుడు రైళ్ల డెకరేషన్ ను మార్చేందుకు, అథితులకు పసందైన విందు భోజనాలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు నిపుణులైన ఈవెంట్ మేనేజర్లు ఉంటారని కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

విహరిస్తూ పెళ్లిళ్లు చేసుకోండి
రైళ్లలో విహరిస్తూ పెళ్లిళ్లు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా వధూవరుల హనీమూన్ కు ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉంటాయని అధికారులు చెప్పారు.

ప్రత్యేక ప్యాకేజీలు
ఉపయోగించుకునే వసతులు, ఎన్ని రోజులు బస చేస్తారు అంటూ ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయని అధికారులు వివరించారు.

రైళ్లలో స్పా
విలాసవంతమైన రైళ్లలో స్పా లాంటి సౌకర్యాలు ఉంటాయని, భారతీయులు, ప్రవాస భారతీయులతో పాటు విదేశీయుల వివాహాలకు కూడా తాము రైళ్లు కేటాయిస్తామని అధికారులు చెప్పారు.

విజయవంతం అవుతాం
ఈ స్కీమ్ ప్యాకేజీలకు ప్రత్యేక రేట్లు ఉంటాయని, తాము కచ్చితంగా విజయవంతం అవుతామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications