వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ఎక్కడ: లుక్ అవుట్ నోటీసులు జారీ, అజ్ఞాతంలో !

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హనీప్రీత్ ఇన్సాన్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

|
Google Oneindia TeluguNews

ఛండీగఢ్: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హనీప్రీత్ ఇన్సాన్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. హనీప్రీత్ ఇన్సాన్ ఎక్కడ దాక్కున్నా పట్టుకోవాలని పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మరన్ని చిక్కుల్లో పడిన హనీప్రీత్ ఇన్సాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్మీత్ రామ్ రహీం సింగ్ ను తప్పించడానికి అతని దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పక్కా ప్లాన్ వేసిందని పోలీసులు కేసు నమోదు చేశారు. పంచుకుల సీబీఐ ప్రత్యేక కోర్టు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను దోషిగా నిర్దారించి 20 ఏళ్లు జైలు శిక్ష వేసిన విషయం తెలిసిందే.

Now Honeypreet Insan Gurmeet Ram Rahims daughter wanted by cops

గుర్మీత్ రామ్ రహీం సింగ్ కు శిక్ష పడిన తరువాత అతన్ని రోహతక్ జైలుకు తరలించే సమయంలో డేరా అనుచరులు మారాణాయుధాలతో దాడి చేసి గుర్మీత్ రామ్ రహీం సింగ్ ను తప్పించడానికి విఫలయత్నం చేశారు. అయితే నేరవిభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు సుమిత్ కుమార్ నేతృత్వంలోని పోలీసు అధికారులు డేరా అనుచరుల ప్రయత్నాలను తిప్పికొట్టారు.

డేరా అనుచరుల ప్లాన్ వెనుక గుర్మీత్ రామ్ రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ఉందని పంచకుల డీసీపీ మన్నీర్ సింగ్ దృవీకరించారు. హనీప్రీత్ సింగ్ ఎర్రబ్యాగ్ సంకేతాలతో హింసకు పాల్పడాలంటూ సంకేతాలు ఇచ్చారని, అమె కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని డీసీపీ మన్నీర్ సింగ్ దృవీకరించారు.

English summary
Honeypreet Insan, the adopted daughter of so-called spiritual leader Gurmeet Ram Rahim Singh, is being hunted by the Haryana police, which today issued an alert at airports and other exit points for her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X