తల్లీకూతుళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ‘ఓలా’ డ్రైవర్
న్యూఢిల్లీ: ఓ మహిళ ప్రయాణికురాలిపై గత డిసెంబర్‌లో అత్యాచారానికి పాల్పడిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్‌కు జీవిత ఖైదు విధించిన తర్వాతి రోజే అలాంటి ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు ఓలా క్యాబ్ డ్రైవర్ తన టాక్సీలో ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ఏఎన్ఐ కథనం ప్రకారం.. న్యూఢిల్లీలో ఓ ఓలా డ్రైవర్.. ఓ మహిళా ప్రయాణికురాలు, ఆమె కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడ్ని ప్రవీణ్ కుమార్‌గా గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.

కాగా, బుధవారం ఘటనపై ఓలా క్యాబ్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఓలా నుంచి ఆ డ్రైవర్‌ను, అతడు నడిపిస్తున్న వాహనాన్ని తొలగించాం. మా సంస్థలో ఇలా ప్రవర్తించే డ్రైవర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం' అని తెలిపారు.
సంస్థ నియమనిబంధనల మేరకు బాధితురాలికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. మా సంస్థలో పని చేస్తున్న డ్రైవర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించేందుకు సిద్ధం. అవసరమైన జిపిఎస్ కోఆర్డినేట్స్ సహాయం ఉంటుందని తెలిపారు. కాగా, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బస్సీ చెప్పారు.












Click it and Unblock the Notifications