ప్లాస్టిక్ పరేషాన్: మొన్న బియ్యం.. నిన్న కోడిగుడ్లు.. నేడు క్యాబేజి!
ఢిల్లీలో ఓ మహిళ క్యాబేజి కూర వండుదామని క్యాబేజిని శుభ్రంగా నీళ్లలో కడిగి కత్తితో కోయబోతే అది ఎంతకీ తెగలేదు. క్యాబేజి ఏమిటి? కత్తికి ఎదురుతిరగడం ఏమిటి? అనుమానం వచ్చిందామెకు. తీరాచూస్తే...
న్యూఢిల్లీ: అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, కుక్కపిల్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నాడో కవి. నిజమే.. ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ కోడిగుడ్లు, ప్లాస్టిక్ కూరగాయలు కాదేదీ కల్తీకి అనర్హం అనుకోవాల్సి వచ్చేటట్టుంది ఇప్పుడు.
వెధవది.. ఈ ప్లాస్టిక్ పరేషాన్ ఏంటో అర్థమై చావడం లేదు. అసలెక్కడ్నించి వస్తున్నాయివి? ఎవరు ఇలాంటి కల్తీకి పాల్పడుతున్నారు? పాపం ఈ మధ్య ఢిల్లీలో ఓ మహిళ కూరగాయల మార్కెట్ కు వెళ్లి ఓ వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంది.

మర్నాడు క్యాబేజి కూర వండుదామని రంగంలోకి దిగింది. క్యాబేజిని శుభ్రంగా నీళ్లలో కడిగి కత్తితో కోయబోతే అది ఎంతకీ తెగలేదు. క్యాబేజి ఏమిటి? కత్తికి ఎదురుతిరగడం ఏమిటి? అనుమానం వచ్చిందామెకు. తీరాచూస్తే అదేదో ప్లాస్టిక్ తో తయారైనదిలా అనిపించింది.
ఎందుకైనా మంచిది నిర్ధారణ చేసుకుందామని గ్యాస్ స్టవ్ అంటించి ఆ క్యాబేజిని మంటపై కాల్చి చూసింది. అనుమానం లేదు. అది ప్లాస్టిక్ క్యాబేజీయే అని తెలుసుకుని సదరు మహిళ షాక్ తింది.
ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి ఫేస్ బుక్ లోకి అప్ లోడ్ చేసింది. తాను ఢిల్లీలోని ఓ ఫేమస్ సూపర్ మార్కెట్‌లో ఈ క్యాబేజి కొన్నానని, అందరినీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించేందుకే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానని ఆ మహిళ పేర్కొంది.
ఇకనుంచి సూపర్‌మార్కెట్లలో ఏదైనా కొనే ముందు జాగ్రత్త. ఎందుకంటే, రసాయనాలతో కలుషితమైనవే కాదు.. ఏకంగా ప్లాస్టిక్ వస్తువులే మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి.
మీరు కొనే పండ్లు, కూరగాయలు చాలా ఫ్రెష్‌గా కనిపించవచ్చుగానీ.. ఇలాంటి ప్లాస్టిక్‌వీ అందులో ఉండే ప్రమాదం ఉంది.
కాబట్టి ఏది కొన్నా ముందు దాన్ని కాస్త పరీక్షగా చూడండి. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండడం మన ఆరోగ్యానికే మంచిది కదా! ప్లాస్టిక్ క్యాబేజి కథేంటో, అది ఎలా ఉంటుందో వీడియోలో చూడండి.












Click it and Unblock the Notifications