రైలులో దసరా పండుగ సంతోషం, యువతుల డ్యాన్స్: ట్వీట్ చేసిన పీయూష్ గోయల్ ఆఫీస్

న్యూఢిల్లీ: దసరా నవరాత్రుల సందర్భంగా అందరూ భక్తి శ్రద్ధలతో పాటు అమ్మవారి పాటలతో ఉత్సాహంగా డ్యాన్సులు కూడా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో తమ సంప్రదాయాలకు అనుగుణంగా పండుగ నిర్వహించుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో నవరాత్రి సందర్భంగా గర్భా నృత్యం చేస్తారు.

ఇప్పుడు కదులుతున్న రైలులో కొందరు యువతులు గర్భా నృత్యం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని కేంద్ర రైల్వే శాఖ మంద్రి పీయూష్ గోయల్ కార్యాలయం ట్వీట్ చేసింది.

Now this is an experience only Indian Railways can provide!

ఈ వీడియోలో కదులుతున్న రైలులో కొందరు మహిళలు గర్భా నృత్యం చేస్తారు. ఈ వీడియోను చాలామంది చూస్తున్నారు. లైక్‌లు కొడుతున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన పీయూష్ గోయల్ కార్యాలయం... ఇండియన్ రైల్వేస్‌లలో మాత్రమే ఇలాంటి సౌకర్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

నవరాత్రి సందర్భంగా రైళ్లో అమ్మవారి ఉత్సవాలు జరుపుకున్న మరికొన్ని ఫోటోలు కూడా రీట్వీట్ చేశారు. 'రైల్వే కేవలం ట్రెయిన్ మాత్రమే కాదు, ఇది రెండో ఇల్లు. ప్రయాణీకులు చాలా అకేషన్లను రైళ్లలో జరుపుకుంటున్నారు. నవరాత్రి సందర్భంగా అమ్మవారి ఉత్సవాన్ని కూడా రైళ్లలో జరుపుకున్నాం. రైలును డెకరేట్ చేసి అమ్మవారిని పూజించుకున్నాం. థ్యాంక్యూ పీయూష్ గోయల్' అని చేసిన పోస్టును రీట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+