ఫేస్‌బుక్, జీమెయిల్ ఖాతాలున్నాయా? అయితే మీకు కాలేజీలో సీటొచ్చినట్లే!

విద్యార్థులను ఫేస్‌బుక్, జీమెయిల్ ఖాతాల ద్వారా గుర్తించి వారికి తమ కళాశాలలో ప్రవేశం కల్పిస్తామని జైపూర్ లోని బార్మేర్ ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపల్ లలితా మెహతా చెప్పారు.

జైపూర్: సాధారణంగా ఏ కాలేజీలో అయినా ప్రవేశానికి ఏం అడుగుతారు? చదువుకు సంబంధించిన ధ్రువపత్రాలతోపాటు ఏ ఆధార్ కార్డో, రేషన్ కార్డో చూపించమంటారు. కానీ జైపూర్ లోని ఓ కాలేజీలో ప్రవేశానికి ఇలాంటి గుర్తింపు కార్డులేమీ అవసరం లేదట. ఫేస్‌బుక్, జీమెయిల్ లో ఖాతా ఉంటే చాలు.. మీకు ఆ కాలేజీలో సీటొచ్చినట్లే!

విద్యార్థులను ఫేస్‌బుక్, జీమెయిల్ ఖాతాల ద్వారా గుర్తించి వారికి తమ కళాశాలలో ప్రవేశం కల్పిస్తామని జైపూర్ లోని బార్మేర్ ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపల్ లలితా మెహతా చెప్పారు.

 Now use FB, Gmail accounts for college admissions in Rajasthan

తన వద్ద ఆధార్ కార్డు లేదని మొదట ఆందోళన చెందానని...కానీ ఫేస్‌బుక్, జీమెయిల్ ఖాతాల ద్వారా కూడా కళాశాల ప్రవేశ దరఖాస్తు నింపవచ్చని కళాశాల అధికారులు చెప్పడంతో తన సమస్య పరిష్కారమైందని ప్రవీణ్ సింగ్ అనే విద్యార్థి చెప్పారు.

ఫేస్‌బుక్, జీమెయిల్ ఖాతాల ద్వారా కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆన్ లైన్ లో చేసుకునే సౌకర్యం కల్పించడంతో ఎక్కువమంది విద్యార్థులు వీటి ద్వారా దరఖాస్తు చేసుకున్నారని కళాశాల విద్యాశాఖాధికారులు చెప్పారు.

కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు ఫారం నింపేందుకు మీ వద్ద గుర్తింపు పత్రాలైన ఆధార్, రేషన్ కార్డులు లేవని ఆందోళన చెందాల్సిన పని లేదని అంటున్నారు రాజస్థాన్ కళాశాల విద్యాశాఖాధికారులు. మీ ఫేస్‌బుక్, జీమెయిల్ ఖాతాల ద్వారా కూడా నేరుగా మీరు కళాశాలలో చేరేందుకు దరఖాస్తు ఫారం నింపవచ్చంటున్నారు వారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+