సెక్స్ రాకెట్: ఈ ఎన్నారై మహిళ ట్రాప్‌లో పడితే...
రాజస్థాన్ పోలీసులు ఛేదించిన సెక్స్ రాకెట్ కేసులో ఓ ఎన్నారై మహిళ కూడా ఉంది. ఆమె ట్రాప్‌లో పడ్డారంటే ఇక అంతేనట. వలపన్నిందంటే పని అయ్యే దాకా వదిలి పెట్టదట...
జైపూర్: రాజస్థాన్ పోలీసులు ఇటీవల ఛేదించిన ఓ సెక్స్ రాకెట్ కేసులో ఓ ఎన్నారై మహిళ పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. ఆ 26 ఏళ్ల ఎన్నారై మహిళ వల పన్నిందంటే పని అయిపోయేదాకా వదిలి పెట్టదని పోలీసులు అంటున్నారు. తనకు డాక్టర్లు, బిల్డర్లు, రిసార్టుల యజమానులు, ఆభరణాల వ్యాపారులతో సహా ఇంకా చాలా మంది బడా వ్యాపారులు తెలుసంటూ ఆమె గాలం వేస్తుందని అంటున్నారు.
హాంకాంగ్‌లో పుట్టిపెరిగి ప్రస్తుతం పంజాబ్‌లోని తన అమ్మమ్మ వద్ద ఆమె ఉంటోంది. ఆమె పేరు రవనీత్ కౌర్. అయితే ప్రేమా, పెళ్లీ అంటూ ఎర వేయడానికి ఆమె తొలుత ప్రయత్నిస్తుందని చెబుతున్నారు. దాంతో కాకపోతే అందాన్ని ఎరగా వేస్తుంది. అమైతేనేం, ఏదో ఒక రూపంలో డబ్బులు దండుకుంటుంది. చివరకు పోలీసులకు చిక్కింది. పోలీసుల విచారణలో రవనీత్ కౌర్ వ్యవహారం సినిమా స్టోరీకి తీసిపోని వాస్తవాలు వెలుగుచూశాయి. అరుగురిని ఆమె బ్లాక్ మెయిల్ చేసినట్లు వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం... 2008లో ఆమె పంజాబ్‌లోని ఆమె సొంతూరుకు వచ్చింది. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్మెంట్‌లో ఓ సర్టిఫికెట్ కోర్సు చేసింది. 2009లో గుర్గావ్ వచ్చి తన స్నేహితురాలి కుటుంబంతో కలిసి నివాసం ఉంది. 2012లో ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీబీఏ కోర్సులో చేరింది. ఆ సమయంలో రోహిత్ శర్మ అనే ఎంబీఏ విద్యార్థితో ప్రేమలో పడింది. కోర్సు పూర్తయ్యాక ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు.

రోహిత్ ఇంట్లో అంగీకరించలేదు. దాంతో అది ముగిసింది. ఉద్యోగం లేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించే మార్గం కోసం వెతికింది. 2013లో సెక్స్ రాకెట్‌ను శాసించే అక్షిత్ శర్మను కలుసుకుంది. అతడు నెలకు రూ.12000ల జీతానికి ఆమెను కుదుర్చుకున్నాడు. ఇతర ముఠా సభ్యులను కూడా కలుసుకుంది.
మొదటి ప్రయత్నంగా 2014లో ఓ ప్రముఖ బిల్డర్ దగ్గరకు ఆమె వెళ్లింది. ఆ తర్వాత సదరు ముఠా సభ్యులు రేప్ కేసుపెడతామని బెదిరిస్తూ రూ.1.20 కోట్లు డిమాండ్ చేశారు. ఇందుకుగానూ ఆ ముఠా నుంచి రవనీత్ తొలి డీల్‌లోనే రూ.30 లక్షలు అందుకుందని ఏఎస్పీ కరణ్ శర్మ వెల్లడించారు. తర్వాత ఇదే ముఠా డాక్టర్లు మొదలు బిల్డర్ల దాకా అనేక మందిని లక్ష్యంగా చేసుకున్నారన్నారు.
నిరుడు ఫిబ్రవరిలో రోహిత్‌ను పెళ్లి చేసుకున్నఆమె దాదాపు రూ.కోటికి పైనే సంపాదించిందనీ, కనీసం ఆరుగురిని బ్లాక్ మెయిల్ చేసిందని పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 24వ తేదీన పోలీసులు ఛేదించిన ఓ సెక్స్ రాకెట్ కేసుతో రవనీత్ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందిందని అంటున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications