హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యుద్ధాలపై అజిత్ ధోవల్ కీలక వ్యాఖ్యలు-ఖర్చుతో కూడినవి, భరించరానివి-ట్రైనీ ఐపీఎస్ లతో

|
Google Oneindia TeluguNews

భారత విదేశాంగవిధానంలో కీలకంగా వ్యవహరిస్తున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఇవాళ యుద్ధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు భరించలేనివి, వ్యయంతో కూడుకువన్నవంటూ ధోవల్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన ఐపీఎస్ ట్రైనీల పరేడ్ లో పాల్గొన్న ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కాబోయే ఐపీఎస్ లకు దిశానిర్దేశం చేశారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో ఇవాళ జరిగిన రెగ్యులర్ రిక్రూట్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీల 73వ బ్యాచ్‌ని ఉద్దేశించి అజిత్ ధోవల్ ప్రసంగించారు. రాజకీయ లేదా సైనిక లక్ష్యాలను సాధించడానికి యుద్ధాలు ప్రభావవంతమైన సాధనాలుగా మారడం ఆగిపోయిందని ధోవల్ తెలిపారు. అవి చాలా ఖరీదైనవి, భరించలేనివని ఆయన వెల్లడించారు. అదే సమయంలో వాటి ఫలితాలపైనా అనిశ్చితి ఉంటుందన్నారు. చట్టం యొక్క ప్రాముఖ్యత, ప్రజల భద్రత వివరిస్తూ.. చట్టబద్ధమైన పాలన విఫలమైనప్పుడు ఏ దేశం చర్చించలేదనన్నారు. చట్టాన్ని అమలు చేసేవారు బలహీనంగా, అవినీతిపరులుగా, పక్షపాతంతో ఉన్నప్పుడు ప్రజలు సురక్షితంగా ఉండలేరని ధోవల్ అన్నారు.

NSA ajit doval key remarks on wars, too expensive and unaffordable

దేశ నిర్మాణంతో పాటు ప్రజా సేవకూడా ఎంతో గొప్పదని అజిత్ ధోవల్.. ఐపీఎస్ ట్రైనీలకు దిశానిర్దేశం చేశారు. వేర్పాటు వాద ఆలోచనలతో దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ధోవల్ హెచ్చరించారు.
చాలా మంది శిక్షణ పొందినవారు రాణించడానికి సాంకేతికత మరో సరిహద్దు అని తెలిపారు. దేశ నిర్మాణంలో ఇవి కీలకమైన అంశాలని అన్నారు. సర్దార్ పటేల్ అకాడమీ మిమ్మల్ని కేవలం పోలీసు నాయకులుగానే కాకుండా కొత్త రాబోయే శక్తివంతమైన భారతదేశానికి సైనికులుగా కూడా తయారు చేస్తున్నట్లు ధోవల్ ఐపీఎస్ ట్రైనీలకు తెలిపారు.

తాజాగా ఆప్ఘనిస్తాన్ పై జరిగిన ప్రాంతీయ జాతీయ సలహాదారుల భేటీకి నేతృత్వం వహించిన ధోవల్.. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను మిగతా దేశాలకు తెలియజేశారు. అలాగే ఆప్ఘన్ గడ్డ ఉగ్రవాదులకు ఉపయోగపడకుండా చూడాలని వారికి పిలుపునిచ్చారు. దీంతో అజిత్ ధోవల్ పాత్ర ఎంత కీలమైనదో మరోసారి స్పష్టమైంది.

English summary
national security advisor ajit doval on today participated in ips officer trainee parade at sardar vallabhai patel national polce academy and made key remarks on wars.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X