జమ్మూలో డ్రోన్ కూల్చివేత .. 5 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ఎన్‌ఎస్‌జి

జమ్మూకాశ్మీర్లో డ్రోన్ల సంచారం ఆగడం లేదు. గత కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్లోని వైమానిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్లు తిరుగుతున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు డ్రోన్లతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని కనచక్ ప్రాంతంలో భారత సరిహద్దులో ఆరు కిలోమీటర్ల దూరంలో డ్రోన్ సంచరించడంతో భద్రత దళాలు కాల్పులు జరిపి కూల్చి వేశాయి. నిత్యం ఎక్కడో ఒకచోట డ్రోన్ల కదలికలు భవిష్యత్ ప్రమాదాలకు సంకేతంగా మారాయి.

ఈ రోజు కనచక్ ప్రాతంలో కూల్చివేసిన డ్రోన్‌ను హెక్సాకాప్టర్‌గా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల ప్రకారం హెక్సాకాప్టర్ నుంచి సుమారు 5 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కనచక్ ప్రాంతంలో ఒక డ్రోన్ పై కాల్పులు జరిపి కూల్చి వేయబడింది అని , పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలియజేశారు. బుధవారం, సత్వారీ ప్రాంతంలో అనుమానాస్పద డ్రోన్ కనిపించగా, అంతకుముందు జూలై 16 న, జమ్మూ ఎయిర్ బేస్ చుట్టూ తిరుగుతున్న డ్రోన్‌ను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) ఏర్పాటు చేసిన యాంటీ-డ్రోన్ సిస్టమ్ యొక్క రాడార్లు గుర్తించాయి.

NSG shot down Drone in Jammu .. seizes 5 kg of explosives

గత నెలలో జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగిన తరువాత జమ్మూలో ఎన్‌ఎస్‌జి యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా జమ్మూ మరియు ఇతర ముఖ్యమైన వైమానిక స్థావరాలలో ఇటువంటి దాడి జరగకుండా వైమానిక దళం చర్యలు చేపట్టింది. చిన్న డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులు చేసే బెదిరింపులను ధీటుగా ఎదుర్కోవడానికి కఠిన చర్యల దిశగా నిర్ణయం తీసుకుంటుంది .

Recommended Video

    Jammu : ఆయుధాలుగా Drones, రోబోటిక్.. భారత్ ఎలా ఎదుర్కొంటుంది? Anti Drone System || Oneindia Telugu

    జమ్మూలో వైమానిక స్థావరంపై దాడి తరువాత, డ్రోన్ లు సంచరిస్తున్న సంఖ్య బాగా పెరిగింది .ఇది భారత భద్రతా వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో సరిహద్దులో పహారా కాస్తున్న ఆర్మీ మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ (బిఎస్ఎఫ్) దళాలు డ్రోన్లను ఎక్కడికక్కడ నిలువరిస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+