సెల్ నెంబర్ చెప్పేసిన సెక్సీ స్టార్ సన్నీలియోన్.. వేలల్లో కాల్స్.. అసలేం జరిగిందంటే..

సెలబ్రిటీలకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. అదీ బాలీవుడ్ సెలబ్రిటీలు అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఒకవేళ బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ ఫోన్ నెంబర్ దొరికిందంటే ఫ్యాన్స్‌కు పండగే. అయితే అలా దొరికిన నెంబర్ ఆమెది కాకుండా వేరొకరిదైతే వారికి ఆ ఫ్యాన్స్ చూపించే నరకం అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్థితినే పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి ఎదుర్కొన్నాడు. ఆ బాధపడలేక పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకీ ఆయన నెంబర్ సన్నీలియోన్ ఫ్యాన్స్ దగ్గరకు ఎలా వచ్చింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవండి.

వందల మంది ఫోన్లు

వందల మంది ఫోన్లు

ఢిల్లీకి చెందిన పునీత్ అగర్వాల్‌కు ఒకరోజు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసిన ఆయనకు సన్నీలియోన్ కోసం ఫోన్ చేశానంటూ ఓ వ్యక్తి చెప్పాడు. రాగ్ నెంబర్ అని చెప్పి పెట్టేసిన పునీత్‌కు ఇక అప్పటి నుంచి ఇదే తరహా ఫోన్‌లు రావడం మొదలయ్యాయి. వందల మంది పంపే మెసేజ్‌లతో ఆయన ఇన్ బాక్స్ నిండిపోయింది. అసలు ఎందుకు ఇలాంటి కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయో తెలియక పునీత్ తల పట్టుకున్నాడు. చివరకు అర్జున్ పటియాలా అనే సినిమా తన పరిస్థితికి కారణమని తెలుసుకున్నాడు.

పునీత్ నెంబర్ చెప్పిన సన్నీ

పునీత్ నెంబర్ చెప్పిన సన్నీ

సన్నీ లియోన్ నటించిన అర్జున్ పటియాలా సినిమా ఇటీవలే రిలీజైంది. ఈ సినిమాలో వచ్చే ఓ సీన్‌లో సన్నీ, ఓ పోలీస్ ఆఫీసర్‌తో మాట్లాడుతూ తన ఫోన్ నంబర్ ఇస్తుంది. దురదృష్టం కొద్ది ఆ నంబర్‌ కాస్త​ పునీత్‌ది కావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ నంబర్ నిజంగా సన్నీదే అని చాలామంది నోట్ చేసేసుకున్నారు. ఇంకేముంది వారం నుంచి ఆయన ఫోన్ నిరంతరాయంగా మోగుతూనే ఉంది. అసభ్య సందేశాలతో ఆయన మెసేజ్ బాక్స్ నిండిపోయింది. దీంతో విసిగిపోయిన పునీత్ అర్జున్ పటియాలా సినిమాపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అనుమతి లేకుండా తన నెంబర్ వాడుకుని ఇబ్బందులు పెడుతున్నారని అందులో పేర్కొన్నాడు.

 బిజినెస్ దెబ్బతింటుందని భయం

బిజినెస్ దెబ్బతింటుందని భయం

ప్రైవేట్ కంపెనీలో పనిచేయడంతో పాటు చిన్న వ్యాపారం చేసే పునీత్ అగర్వాల్ ఆ ఫోన్ నెంబర్‌ను 12 ఏళ్ల నుంచి వాడుతున్నాడు. బిజినెస్ కోసం చాలా మందికి ఈ నెంబర్ ఇవ్వడంతో ఇప్పుడు దాన్ని మార్చితే తాను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నాడు. అర్జున్ పటియాలా సినిమా టీంపై కంప్లైంట్ చేసినా పోలీసులు ఏం చేయకపోవడంతో పునీత్ కోర్టు మెట్లెక్కాలని నిర్ణయించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+