తలుపు తట్టి గదిలోకి చొరబడి ట్రైనీ నన్‌పై గ్యాంగ్ రేప్
బెంగళూర్: నన్‌గా శిక్షణ పొందుతున్న ఓ యువతిపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం జరిపారు. ఈ సంఘటన బెంగళూర్‌లో జరిగింది. నన్‌లుగా శిక్షణ పొందడానికి కొంత మంది యువతులు బెంగళూర్ వచ్చారు. వారిలో బాధితురాలు కూడా ఉంది.
ఆమె ఉంటున్న గది తలుపు తట్ిట, ఆమె తలుపులు తెరవగానే ఆణె ముఖం మీద ఇద్దరు నిందితులు మత్తు మందు చల్లారు. ఆమె మత్తులోకి వెళ్లగానే ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్పారు. శిక్షణా శిబిరంలో ఉన్న సీనియర్లకు బాధితురాలు ముందు చెప్పి ఆ తర్వాత తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, యువతికి సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామని చెప్పారు. బాధితురాలికి 15 ఏళ్లు ఉంటాయి. బుధవారం సాయంత్రం ఈ దారుణ సంఘటన జరిగింది.
పై అంతస్తులో ఉన్న ఇద్దరు సిస్టర్లు కిందికి వచ్చి చూసే సరికి బాధితురాలి గది తలుపులు తెరిచి ఉన్నాయి. ఆమె స్పృహ కోల్పోయి పడి ఉంది. బాధితురాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని, ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించి మానసికంగా కోలుకున్న తర్వాత నిందితులను గుర్తించగలదేమో తెలుసకుంటామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications