మలయాళీ నర్స్ ఆత్మహత్య, మరో మహిళతో భర్తకు...

ఈ సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ప్రిన్సీ ఆత్మహత్యకు స్బంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రిన్సీ భర్త షిజు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫోన్ చేశాడు. తన భార్య గదిలోపల తాళం వేసుకుందని, ఉరేసుకుందని సమాచారం అందించాడు.
పశ్చిమ విహార్ పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ప్రిన్సీ తొమ్మిది నెలల గర్భిణి అని పోలీసులు చెప్పారు.
మృతురాలు ప్రిన్సీ సోదరుడు మాట్లాడుతూ... తాను తన బావ షిజు ద్వారా తన సోదరి మృతి గురించి తెలుసుకున్నానని, కారణమేమిటని ఆయనను అడిగితే, అతని నుండి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. గత కొంతకాలంగా తన సోదరిని షిజు డబ్బు కోసం వేధిస్తున్నాడని ఆరోపించారు.
షిజు నిత్యం తాగుతూ వేధించేవాడని, అంతేకాకుండా అతనికి మరో మహిళతో సంబంధం ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించి భార్యాభర్తల మధ్య వాగ్వదం జరిగేదని చెప్పారు. ఫ్రిన్సీని తరుచూ కొట్టేవాడు. అబార్షన్ చేసుకోమని కూడా షిజు భార్యను వేధించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రిన్సీ ఇడుక్కిలోని తోడుపుజాకు చెందిన వారు. షిజు అదూర్‌కు చెందిన వారు. కాగా, షిజును ప్రశ్నించేందుకు పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ కోసం పోలీసులు వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications