Nurse: నర్సుతో ఎంజాయ్ ప్రియుడి జల్సాల కోసం వ్యాక్సిన్ దందా, ఆసుపత్రిలో స్కెచ్, షాక్ !
బెంగళూరు/ హుబ్బళి: ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి ప్రియుడు నానా తిప్పలు పడుతున్నాడు. ఎలాగైనా ఎంజాయ్ చెయ్యాలనే ఆశతో ప్రజలకు అవసరమైన కో వ్యాక్సిన్ దందా చెయ్యాలని ప్రియుడు స్కెచ్ వేశాడు. ప్రియుడు వేసిన స్కెచ్ కు ప్రియురాలు సహకారం అందించింది. పేదలకు ఉచితంగా వేస్తున్న కో వ్యాక్సిన్ ను ఆసుపత్రిలో నొక్కేస్తున్న ప్రియురాలు వాటిని బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ప్రియురాలు ఆసుపత్రిలో నర్సు కావడంతో వీళ్లు అనుకున్న పని గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది.

నర్సుకు క్లీనర్ లవర్
కర్ణాటకలోని హబ్బళి నగరంలో తత్వదర్శి ఆసుపత్రిలో రియా అనే మహిళ నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. హుబ్బళిలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న సిద్దనగౌడ పాటిల్ క్లీనర్ గా పని చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం రియాకు లైన్ వేశాడు. పాటిల్ లో ఏమి చూసిందో ఏమో కాని రియా కూడా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

టార్గెట్ రెమిడెసివిర్ వ్యాక్సిన్
క్లీనర్ గా పని చేస్తున్న పాటిల్ ప్రియురాలు రియాతో ఎంజాయ్ చెయ్యడానికి అతను సంపాధిస్తున్న డబ్బులు సరిపోలేదు. ఎలాగైనా బాగా డబ్బులు సాంపాధించాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన పాటిల్ వల్లకాలేదు. కరోనా వైరస్ కు ప్రతిఒక్కరు భయపడుతున్నారని, కరోనా వ్యాధి నుంచి తప్పించుకోవడానికి ఆయుధం అయిన వ్యాక్సిన్ దందా చెయ్యాలని పాటిల్ డిసైడ్ అయ్యాడు.

ప్రియుడి కోరిక తీర్చేసిన నర్సు
మీ ఆసుపత్రిలో రెమిడెసివిర్ వ్యాక్సిన్లు చోరీ చేసి తీసుకు వస్తే తాను బ్లాక్ లో విక్రయిస్తున్నాని, వచ్చే డబ్బుతో మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని పాటిల్ అతని ప్రియురాలు రియాకు చెప్పాడు. ప్రియుడు పాటిల్ చెప్పినట్లు రియా ఆసుపత్రిలో రిమిడెసివిర్ వ్యాక్సిన్ చోరీ తీసుకెళ్లి ప్రియుడు పాటిల్ కు ఇచ్చింది.
Recommended Video

దూల తీరిపోయింది
రెమిడెసివిర్ వ్యాక్సిన్ బ్లాక్ లో విక్రయిస్తున్న పాటిల్ డబ్బులు తీసుకెళ్లి ప్రియురాలు రియాకు ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. కో వ్యాక్సిన్ బ్లాక్ లో విక్రయిస్తున్నారని హుబ్బళి క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో కో వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న ప్రేమికులు పాటిల్, నర్సు రియాను అరెస్టు చేసి జైలుకు పంపించారు.












Click it and Unblock the Notifications