నర్సు నిహారిక హత్య కేసులో మరో మలుపు: సూత్రధారిగా కానిస్టేబుల్!

భువనేశ్వర్: ఒడిశాలో సంచలనం సృష్టించిన నర్సు నిహారిక హత్యోదంతం అనూహ్య మలుపు తిరిగింది. ఈ హత్యకేసులో ఆమె ప్రియుడు, పోలీస్ కానిస్టేబుల్ ను ప్రధాన నిందితుడిగా తేలింది. అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. మీడియా ముందు ప్రవేశ పెట్టారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ నిహారిక ఒత్తిడి తెస్తుండటమే ఈ హత్యకు ప్రధాన కారణమని అన్నారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లా భింగారాపూర్ గ్రామానికి చెందిన నిహారిక పట్రా కటక్ లోని ఎంఎం ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. జిల్లాలోని బిరిడి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న కిశోర్ ఆంచల్ అలియాస్ రాజా, నిహారిక పరస్పరం ప్రేమించుకుంటున్నారు.

కొద్దిరోజుల పాటు వారిద్దరూ సహజీవనం కూడా చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది ఈ సందర్భంగా నిహారిక.. తనను పెళ్లి చేసుకోవాలంటూ రాజాపై ఒత్తిడి తీసుకుని రాసాగారు. దీనితో అతను ముఖం చాటేయడం మొదలు పెట్టాడు. సెల్ ఫోన్ కు కూడా అందుబాటులో లేకపోవడంతో.. నిహారిక నేరుగా అతని ఇంటికి వెళ్లి నిలదీశారు. దీన్ని అవమానంగా భావించిన రాజా.. నిహారికను హత్య చేయడానికి కుట్ర పన్నాడు. ఈ నెల 8వ తేదీన ఆమెను అపహరించాడు. మరో వంక తమ కుమార్తె కనిపించట్లేదంటూ నిహారిక తల్లిదండ్రులు.. బలిపటన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Nurse Niharika Murder: Jagatsinghpur SDJM allows 3-day remand of accused

గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు 16వ తేదీన ఆమె మృతదేహం కనిపించింది. కటక్ సమీపంలోని బిలువాఖయ్ నది ఒడ్డున ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఉంచిన నిహారిక మృతదేహాం కుళ్లి పోయిన స్థితిలో పోలీసులు గుర్తించారు. తొలుత- ఈ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు బిరడి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహం నిహారికదేనని నిర్దారించారు. కేసు దర్యాప్తులో అనేక కోణాలు వెలుగులోకి వచ్చాయి. తమ డిపార్ట్ మెంట్ కే చెందిన కానిస్టేబుల్ రాజా ప్రధాన నిందితుడిగా గుర్తించారు. వెంటనే అతణ్ని అరెస్టు చేశారు. నిహారికను హత్య చేసినట్లు రాజా అంగీకరించినట్లు జగత్ సింగ్ పూర్ పోలీసులు తెలిపారు.

Nurse Niharika Murder: Jagatsinghpur SDJM allows 3-day remand of accused

నిహారిక కనిపించకుపోయిన రోజే ఆమెను హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. సీసీ కెమెరాల ద్వారా రాజాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈ హత్యకేసులో రాజాకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేశామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+