DMK కండువా కప్పుకొన్న జయలలిత వీర విధేయుడు, మాజీ సీఎం
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. తమిళనాడు. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేతో పాటు తమిళగ వెట్రి కజగం.. (TVK) పూర్తి స్థాయి ఎన్నికల సంగ్రామానికి దిగబోతోంది. ఫలితంగా త్రిముఖ పోటీ నెలకొంది. టీవీకే తరఫున ప్రముఖ నటుడు దళపతి విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని టీవీకే ఇదివరకే అధికారికంగా ప్రకటించింది కూడా.
ఈ పరిణామాల మధ్య తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బహిష్కృత సీనియర్ నాయకుడు ఓ. పన్నీర్‌సెల్వం.. అధికార డీఎంకేలో చేరారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వీర విధేయుడైన పన్నీర్ సెల్వం కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిశారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. స్టాలిన్ చేతుల మీదుగా తీర్థం పుచ్చుకున్నారు.

మంత్రి పీకే శేఖర్ బాబు మధ్యవర్తిత్వంతో ఇది సాధ్యపడింది. పన్నీర్ సెల్వం రాకతో డీఎంకేకు బిగ్ బూస్ట్ లభించినట్టయింది. ఓపీఎస్ ప్రవేశం డీఎంకేకు వ్యూహాత్మకంగా భావిస్తోన్నారు. దక్షిణ తమిళనాడులోని థేవర్ సామాజిక వర్గం ఓటుబ్యాంక్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆయనకు బలమైన మద్దతు ఉంది. ఇది- ఏఐఏడీఎంకేను దెబ్బకొడుతుందని, ఓటు బ్యాంకు చీల్చి, అసంతృప్త క్యాడర్‌ను డీఎంకే వైపు ఆకర్షిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన ఓపీఎస్.. 2016లో జయలలిత మరణానంతరం పార్టీలో తీవ్ర అధికార పోరాటంలో చిక్కుకున్నారు. ఎడప్పాడి పళనిసామి (ఈపీఎస్) తో వైరం ఏఐఏడీఎంకే చీలికకు దారితీసింది. దీంతో సంస్థాగతంగా పార్టీలో పట్టును కోల్పోయారు. అనంతరం బహిష్కరణకు గురయ్యారాయన. దీని తర్వాత పన్నీర్‌సెల్వం స్వతంత్ర రాజకీయ గుర్తింపు కోసం ప్రయత్నించారు గానీ అది పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు.
ఏఐఏడీఎంకే వర్కర్స్ రిట్రీవల్ ఆర్గనైజేషన్ కింద రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. జయలలిత వారసుడిగా ప్రకటించుకున్నప్పటికీ, ఆయన వర్గం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికలు సమీపించి నేపథ్యంలో ఏఐఏడీఎంకేతో తిరిగి కలవడానికి ఓపీఎస్ సుముఖత చూపారు. ఈపీఎస్‌ను పెద్దన్నయ్యగా సంబోధించారు. దీన్ని ఈపీఎస్ పట్టించుకోలేదు. సయోధ్యను ప్రయత్నాలను తోసిపుచ్చారు. ఓపీఎస్ ను తిరిగి పార్టీలోకి చేర్చుకునే అవకాశాలను కొట్టిపారేశారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications