అమ్మ భక్తి: జయలలిత ఫోటోతో సీఎం సెల్వం (ఫోటో)

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం బధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చిత్రంతో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన పలువురితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముందు టేబుల్ పైన జయలలిత చిత్రం ఉంది.

మరోవైపు, జయలలిత ముఖ్యమంత్రి పీఠం పై నుండి దిగి నెలలు గడుస్తున్నప్పటికీ ఆమె ఫోటోలు కొన్ని వెబ్ సైట్లలో కనిపించడం గమనార్హం. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్టుమెంట్ వెబ్‌సైట్లో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చిత్రానికి బదులు జయలలిత చిత్రాలు కనిపించాయి.

O Pannerselvam gave pose with Jayalalithaa's portrait

కాగా, దాదాపు రెండు నెలల తరువాత జయలలిత పార్టీ పనుల్లో నిమగ్నమయ్యారు. 2016 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఇప్పటినుంచే పునరుద్ధరించి, బలోపేంతం చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా నిర్ధారణవడం, దాంతో శిక్షపడి జైలుకు వెళ్లడం, మళ్లీ బెయిల్ పైన బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

జయలలిత ఎమ్మెల్యేగా అర్హత కోల్పోయారు. పదేళ్ల వరకు పోటీ చేసే అవకాశం లేదు. దాంతో, పార్టీలో తన స్థానాన్ని పటిష్ట పరుచుకుని, అన్నాడీఎంకే అధినేత్రిగా చక్రం తిప్పనున్నారు. పార్టీకి సంబంధించిన పన్నెండు నగరపాలక సంస్థల్లో పార్టీ యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+