'ప్రయివేటు ప్రదేశాల్లో అసభ్య చేష్టలు నేరం కాదు'
ముంబై: అసభ్య ప్రవర్తన, అసభ్య కార్యకలాపాల నేపథ్యంలో 13 మందిని అరెస్టు చేశారు. అయితే, ప్రయివేటు ప్రాంతాలలో అసభ్య కార్యకలాపాలు నేరం కాదు అని బాంబే హైకోర్టు శనివారం నాడు పేర్కొంది. తద్వారా అరెస్టైన 13 మందికి ఊరట లభించింది.
ప్రయివేటు ప్రదేశాల్లో జరిగే అసభ్య కార్యకలాపాలను చట్టప్రకారం నేరంగా పరిగణించలేమని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది. జస్టిస్ పాటిల్, జస్టిస్ బండార్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

తమ పక్కనున్న ఓ ఫ్లాట్‌లో మహిళలు అసభ్య నృత్యాలు చేస్తుంటే, అక్కడున్న పురుషులు వారిమీద డబ్బులు వెదజల్లుతూ, శబ్దంతో పాటలు పెట్టి ఇబ్బంది కలిగిస్తున్నారని ఓ విలేకరి గతేడాది డిసెంబరు 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు పదమూడు మంది పురుషులను అరెస్టు చేశారు. దీనిపై వారు హైకోర్టుకు వెళ్లారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్య కార్యకలాపాలకు దిగితేనే 294వ సెక్షన్ ప్రకారం నేరం అవుతుందని, ప్రయివేటు ప్రదేశాలకు అది వర్తించదని వారి తరఫు లాయర్ చెప్పగా, హైకోర్టు ఏకీభవించి, నిందితులపై కేసు కొట్టి వేసింది.












Click it and Unblock the Notifications